ETV Bharat / business

Hyundai Latest Car Launch 2023 : హ్యుందాయ్​ క్రెటా, అల్కజార్​ అడ్వెంచర్​ కార్లు లాంఛ్​.. ధరలు ఎంతంటే?

author img

By

Published : Aug 8, 2023, 10:03 PM IST

Hyundai  Alcazar Adventure Edition launched
Hyundai Creta Adventure Edition launched

Hyundai latest Car Launch 2023 : ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ హ్యుందాయ్ భారత్​ మార్కెట్​లో హ్యుందాయ్ క్రెటా, అల్కజార్​ అడ్వెంచర్​ కారులను లాంఛ్​ చేసింది. సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న ఈ మిడ్​సైజ్​ ఎస్​యూవీ కార్ల ధర ఎంత, ఏయే వేరియెంట్లలో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Hyundai latest Car Launch 2023 : ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ హ్యుందాయ్​.. ఇండియన్​ మార్కెట్​లో హ్యుందాయ్ క్రెటా, అల్కజార్​ అడ్వెంచర్​ ఎడిషన్​లను లాంఛ్​ చేసింది. అత్యాధునిక ఫీచర్స్​తో పాటు కాస్మెటిక్​ అప్​డేట్స్​తో రూపుదిద్దుకున్న ఈ మిడ్​-సైజ్ ఎస్​యూవీ ​ప్రీమియం ఎడిషన్​ వేరియెంట్లను కార్​ లవర్స్​కు అందుబాటులోకి తెచ్చింది.

హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్​ ఎడిషన్ ధర రూ.15.17 లక్షలు(ఎక్స్​-షోరూం) కాగా, హ్యుందాయ్ అల్కజార్​ అడ్వెంచర్​ ఎడిషన్ ధర రూ.19.04 లక్షలు(ఎక్స్​-షోరూం)గా ఉంది. ఈ రెండు అడ్వెంచర్​ ఎడిషన్​ కార్లలో వివిధ వేరియెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇప్పుడు వేరియెంట్ల వారీగా ధరలు ఇలా ఉన్నాయో చూద్దాం.

హ్యూందాయ్ క్రెటా అడ్వెంచర్​ ఎడిషన్ ధర​
Hyundai Creta Adventure Edition Price :

క్రెటా వేరియెంట్​ ధర (ఎక్స్​-షోరూం)
1.5 పెట్రోల్​ ఎస్​ఎక్స్​ ఎమ్​టీ ఏఈ రూ.15.17 లక్షలు
1.5 పెట్రోల్​ ఎస్​ఎక్స్​(ఓ) ఐవీటీ ఏఈరూ.17.90 లక్షలు

హ్యూందాయ్​ అల్కజార్​ అడ్వెంచర్​ ఎడిషన్​ ధర
Hyundai Alcazar Adventure Edition Price :

అల్కజార్ వేరియెంట్ ధర (ఎక్స్​-షోరూం)
1.5 టర్బో పెట్రోల్​ ప్లాటినమ్​ ఎమ్​టీ ఏఈ రూ.19.04 లక్షలు
1.5 టర్బో పెట్రోల్ సిగ్నేచర్​(ఓ) డీసీటీ ఏఈరూ.20.64 లక్షలు
1.5 టర్బో డీజిల్​ ప్లాటినమ్​ ఎమ్​టీ ఏఈ రూ.19.99 లక్షలు
1.5 టర్బో డీజిల్ సిగ్నేచర్​(ఓ) ఎమ్​టీ ఏఈ రూ.21.24 లక్షలు

ఇంజిన్​ అండ్​ గేర్​బాక్స్..
Hyundai Adventure Edition car Engine and Gearbox : హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ కారులో 1.5-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ ఇంజిన్​ ఉంది. ఇది 113 బీహెచ్​పీ పవర్​, 144 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. అలాగే దీనిలో 6-స్పీడ్​ మాన్యువల్ గేర్​బాక్స్​+ ఐవీటీ (సీవీటీ) కూడా ఉన్నాయి.

హ్యుందాయ్​ అల్కజార్​ 158బీహెచ్​పీ పవర్​ జనరేట్ చేసే 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ మోటార్​తో వస్తుంది. అలాగే ఈ కారు 113 బీహెచ్​పీ పవర్ జనరేట్​ చేసే 1.5 లీటర్​ డీజిల్​​ ఇంజిన్​తోనూ లభిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా మాన్యువల్​, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్లను కలిగి ఉంటాయి.

కొత్తదనం ఏముంది?
Hyundai Adventure Edition car new features : హ్యుందాయ్​ ఎస్​యూవీ అడ్వెంచర్ ఎడిషన్​ కార్లను.. అందంగా తీర్చిదిద్దడం కోసం.. సరికొత్త బ్లాక్డ్​-అవుట్​ గ్రిల్​, బంపర్​లు, స్కిడ్​ ప్లేట్లు, డార్క్​ కలర్​ అల్లాయ్ వీల్స్​ను అమర్చారు.

ఈ కార్లలో మోనో టోన్​, డ్యూయెల్ టోన్​ కలర్​ స్కీమ్​లు కూడా అందుబాటులో ఉన్నాయి. కారు లోపలి భాగంలో.. సేజ్​ గ్రీన్​ కలర్​తో కూడిన ఆల్​-బ్లాక్​ క్యాబిన్​ ఉంది. అలాగే డ్యూయెల్ కెమెరాలతో కూడిన డాష్​క్యామ్​ లాంటి మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.