Digital Assets Management : సాంకేతికత అత్యున్నత దశలో ఉన్న నేటి కాలంలో ప్రతీదీ డిజిటలేజేషన్ అయిపోతోంది. సరికొత్త డిజిటల్ ఆస్తులు రూపొందుతున్నాయి. క్రిప్టో కరెన్సీ, నాన్-ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ), ఆన్లైన్ బిజినెస్‌లు సహా అనేక రకాల డిజిటల్ ఆసెట్స్.. నేటి ఇన్వెస్టర్ల ఫైనాన్సియల్ పోర్ట్‌ఫోలియోల్లో చేరుతున్నాయి. ఈ డిజిటల్ ఆస్తులు గణనీయమైన విలువను, సంభావ్యతను కలిగి ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్కటే ప్రశ్న.. మన తరువాత ఈ డిజిటల్ ఆస్తులు.. మన వారసులకు సురక్షితంగా అందుతాయా?
నిర్లక్ష్యం చేయవద్దు!
Digital Asset Protection : నేటి యువత చాలా వరకు డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ వాటిని సురక్షితం చేసుకునే విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధగా ఉంటున్నారు. ఒక వేళ దురదృష్టవశాత్తు వారికి ఏమైనా జరిగితే.. ఆ డిజిటల్ ఆస్తులు వారు కుటుంబీకులకు లేదా వారసులకు చెందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే డిజిటల్ ఆస్తులను ఉన్నవారు.. వెంటనే వీలునామా (Will) రాయించుకోవడం ఉత్తమం.
ఒక కల్పిత ఉదాహరణను చూద్దాం. డానిల్ అనే ఒక యువకుడు ఉన్నాడు. అతను క్రిప్టో కరెన్సీ, ఎన్‌ఎఫ్‌టీల్లో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే అనేక రకాల ఆన్లైన్ బిజినెస్‌లు చేశాడు. వాటిల్లో భారీ లాభాలను కూడా గడించాడు. కానీ వీటి గురించి తన ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. కనీసం వీలునామా (Will) కూడా రాయలేదు. దురదృష్టం ఏమిటంటే.. అతను అకాల మరణం పొందాడు. ఇప్పుడు అతని డిజిటల్ ఆస్తులు.. అతని కుటుంబ సభ్యులకు, వారసులకు చెందకుండా పోయాయి. ఇది వినడానికే భయంకరంగా ఉంది కదా!
వీలునామా తప్పనిసరి!
Digital Property Will Document : ఇలాంటి సమస్యలు మనకు ఎదురుకాకుండా ఉండాలంటే.. కచ్చితంగా మన డిజిటల్ ఆస్తుల గురించి ఇంట్లో చెప్పాలి. అలాగే వాటికి నామినీని ఏర్పాటు చేసుకోవాలి. కచ్చితంగా తన తదనంతరం.. బంగారం, భూమి, ఇళ్లు, డబ్బులు మాత్రమే కాకుండా డిజిటల్ ఆస్తులు కూడా వారసులకు చెందేలా (Digital Asset Protection) వీలునామా రాసుకోవాలి. అప్పుడే ఎలాంటి న్యాయపరమైన వివాదాలు, చిక్కులు లేకుండా వారసులకు మన ఆస్తులు అందుతాయి.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్
Social Media Asset Management : నేటి కాలంలో యువత సోషల్ మీడియా మానియాలో బ్రతికేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, టిక్‌టాక్, బ్లాగ్‌లను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఫలితంగా నేడు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ హవా బాగా నడుస్తోంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు.. వారి అకౌంట్స్, ఛానల్స్, బ్లాగ్స్.. వాటిలోని కంటెంట్, ఫాలోవర్ బేస్.. ఇవన్నీ కూడా డిజిటల్ ఆసెట్స్ కిందకు వస్తాయి. వీటికి ఆర్థికంగానూ, సెంటిమెంటల్గానూ మంచి విలువ ఉంటుంది. ఒక వేళ వీరు దురదృష్టవశాత్తు మరణిస్తే.. ఈ డిజిటల్ ఆస్తుల (Digital Asset Protection) పరిస్థితి ఏమిటి? ఎప్పుడైనా ఊహించారా?
డిజిటల్ ఆస్తులను రక్షించుకోండి!
Digital Property Rights Protection : ఇన్‌ప్లూయెన్సర్లు.. తమ సోషల్ మీడియా అకౌంట్స్‌తో పాటు రాయల్టీస్, డిజిటల్ రైట్స్, బ్రాండింగ్ ఎలిమెంట్స్ అన్నీ తమ వారసులకు చెందే విధంగా వీలునామా రాయించుకోవాలి.
డిజిటల్ ప్రాపర్టీస్ ఉన్న ప్రతి ఒక్కరూ.. తమ వాలెట్స్, ఎన్ఎఫ్టీ, డిజిటల్ సబ్స్క్రిప్షన్, ఆన్లైన్ బిజినెస్ షేర్స్, సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ కరెన్సీలు తమ వారసులకు అందేలా వీలునామా రాయించాలి. అలాగే మీ వీలునామాలో.. మీ అకౌంట్ పాస్వర్డ్లు, క్రిప్టోగ్రాఫిక్ కీ గురించి రాసి, వాటిని మీ వారసులు యాక్సెస్ చేసుకునే విధంగా వివరణాత్మకంగా (Digital Asset Protection) సూచనలు అందించాలి. ఇదంతా మీకు కష్టంగా అనిపిస్తే.. కచ్చితంగా డిజిటల్ ఆసెట్స్ అండ్ ఎస్టేట్ లాలో నిష్ణాతులైన న్యాయ నిపుణుల సహాయం తీసుకోవాలి.
డిజిటల్ ఛాలెంజెస్
Digital Property Rights In India : డిజిటల్ ఆస్తులను సంరక్షించుకోవడంలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు డిజిటల్ ఆస్తుల సంరక్షణ గురించి ప్రత్యేకమైన చట్టాలు మన దగ్గర లేవు. ముఖ్యంగా భారత వారసత్వ చట్టం- 1925లో డిజిటల్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రస్తావన లేదు.
Digital Asset Management Challenges : ప్రతిరోజూ సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న నేటి కాలంలో.. వాటికి తగ్గట్టుగా చట్టాలను మార్చడం లేదా రూపొందించడం కష్టసాధ్యం. మరో వైపు ఇప్పటికీ టెక్నాలజీకి ఆమడదూరంలో ఉన్నవారు ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చదువులేని వాళ్లు ఉన్నారు. అలాంటి వారు డిజిటల్ ఆస్తులను ఉపయోగించుకోవడం కత్తిమీద సాము లాంటిదే.