ETV Bharat / business

బోల్డ్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లు- సరికొత్తగా హ్యుందాయ్ క్రెటా- ధర ఎంతో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 12:53 PM IST

Hyundai Creta Facelift 2024
Hyundai Creta Facelift 2024

Hyundai Creta Facelift 2024 : అత్యాధునిక ఫీచర్లు, ADAS, బోల్డ్ డిజైన్ మార్పులతో హ్యూందాయ్ క్రెటా వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీల కార్లకు ధీటుగా హ్యూందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్​లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి హ్యూందాయ్ క్రెటా ఫీచర్ల గురించి ఓసారి తెలుసుకుందాం.

Hyundai Creta Facelift 2024 : హ్యుందాయ్ కంపెనీ 2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ క్రెటా కారును ఇండియన్ మార్కెట్​లో విడుదల చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్​ ఈ నయా కారు ముందు భాగం డిజైన్​లోనూ సరికొత్త మార్పులు చేసింది. ఇంటీరియర్​లోనూ అనేక కొత్త ఫీచర్లను ఏర్పాటుచేసింది. అంతేకాదు ఈ కారులో లెవెల్-2 ADAS టెక్నాలజీని పొందుపరిచింది.

Hyundai Creta Features : వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న హ్యూందాయ్ కొత్త మోడల్ కారులో ఆధునాతన భద్రత ప్రమాణాలను జోడించారు. ఇందులో ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ కొలిషన్ వార్నింగ్ & అవాయిడెన్స్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రియర్ క్రాస్ ఉన్నాయి.

అంతే కాకుండా, ఫేస్‌ లిఫ్టెడ్ క్రెటాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సీట్లపై సీట్‌బెల్ట్‌లు, EBD, ESC, టైర్ ప్రెజర్ మానిటర్, పార్కింగ్ సెన్సార్‌, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి చాలా ఫీచర్లతో మార్కెట్లోకి క్రెటా వస్తుంది. ఇవే కాకుండా ఇతర సౌకర్యాలు చాలానే ఉన్నాయి. 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇక డిజైన్ పరంగా మన దేశ మార్కెట్ కోసం ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్, బాక్సియర్ హెడ్ లైట్ ఏర్పాటు చేశారు. దీనివల్ల స్లాట్డ్ గ్రిల్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వెనుక భాగం స్ప్లిట్-LED టెయిల్ ల్యాంప్‌లతో అద్భుతంగా కనిపిస్తోంది. ఇది ఆడి వంటి డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లను తెలియజేస్తోంది.

కొత్త హ్యూందాయ్ క్రెటా క్యాబిన్ లోపల భాగం, డ్యాష్‌బోర్డ్ డిజైన్​పై చాలా మార్పులు చేయాలని వినియోగదారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, వెనుక సీటులో ఉన్నవారి కోసం USBతోపాటు సీ-టైప్ ఛార్జర్‌లు ఉండాలనే డిమాండ్​లు వస్తున్నాయి. అవుట్‌గోయింగ్ మోడల్‌లోని అన్ని ఇంజిన్-గేర్‌బాక్స్ కాంబోలు అప్‌డేట్ చేసిన మోడల్‌లో కొనసాగుతాయి.

ఇదేవిధంగా ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను పరిశీలిస్తే, ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా ప్రస్తుత మోడల్ ధర ఎక్స్ షోరూమ్ రూ. 10.87 లక్షలు ఉండే అవకాశం ఉంది. కొత్త మార్పులతో వచ్చే ఏడాది మార్కెట్ లోకి రానున్న కొత్త క్రెటా.. వోక్స్‌వ్యాగన్ టైగన్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, MG ఆస్టర్, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు బలమైన పోటీదారుగా ఉంటుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

లేడీస్​ స్పెషల్​ - రూ.1 లక్ష బడ్జెట్లో ఉన్న టాప్​-5 స్కూటీలు ఇవే!

2024లో లాంఛ్​ కానున్న టాప్​-5 సూపర్ స్టైలిష్​ కార్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.