ETV Bharat / business

Gold Rate Today : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర ఎంతంటే?

author img

By

Published : Jul 26, 2023, 11:46 AM IST

Gold Silver And Fuel Prices Today
స్థిరంగా బంగారం ధర​​.. స్వల్పంగా పెరిగిన సిల్వర్​ రేట్​.. ఏపీ తెలంగాణలో ఎంతంటే..?

Gold Price Today : దేశంలో బంగారం ధర​​ స్థిరంగా ఉండగా.. వెండి ధర​ స్వల్పంగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర​​ స్థిరంగా ఉంది. వెండి ధర​ స్వల్పంగా పెరిగింది. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,117గా ఉండగా.. బుధవారం రూ.61,132గా ఉంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.76,025 ఉండగా.. రూ.375 పెరిగి రూ.76,400కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,132గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,400గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,132గా ఉంది. కిలో వెండి ధర రూ.76,400కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,132గా ఉంది. కిలో వెండి ధర రూ.76,400గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,132గా ఉంది. కిలో వెండి ధర రూ.76,400కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి గమనించవలెను.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1963 డాలర్లుగా ఉండగా.. బుధవారం స్పాట్​ గోల్డ్​ ధర 1963 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి​ ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 24.61 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,89,876 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, యూఎస్​డీ కాయిన్​ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, బైనాన్స్ కాయిన్​ మాత్రం నష్టాల్లో ఉంది. ​ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.23,89,876
ఇథీరియం రూ.1,51,958
టెథర్ రూ. 81.87
బైనాన్స్ కాయిన్ రూ.19,440
యూఎస్​డీ కాయిన్ రూ. 81.92

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి రూ.81.95 వద్ద స్థిరపడింది.

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today : విదేశీ తాజా నిధుల ప్రవాహం, యూఏస్​ మార్కెట్లలో దూకుడుతో బుధవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 455 పాయింట్లు లాభపడి 66,810 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు వృద్ధి చెంది 19,802 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
ఎల్​ అండ్​ టీ, రిలయన్స్, ఐటీసీ, సన్​ ఫార్మా, టాటా మోటార్స్, హెచ్​యూఎల్, టెక్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్, ఇన్ఫోసిస్​, విప్రో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :
ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఏషియన్​ పెయింట్స్​, టైటాన్​ స్టాక్​లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.