ETV Bharat / business

IRCTC Service Restored : 4 గంటల అంతరాయం తరువాత.. టికెట్​ బుకింగ్ సేవలు పునరుద్ధరించిన IRCTC

author img

By

Published : Jul 25, 2023, 6:04 PM IST

IRCTC Service Restored
IRCTC online ticket booking service restored after 4 hours

IRCTC Service Restored : ఐఆర్​సీటీసీ టికెట్ల బుకింగ్​లో తలెత్తిన సాంకేతిక సమస్య ఎట్టకేలకు తొలగిపోయింది. 4 గంటల అంతరాయం తరువాత టికెట్​ బుకింగ్ సేవలు మరలా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఐఆర్​సీటీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

IRCTC Service Restored : రైల్వే ప్రయాణికులను గుడ్​ న్యూస్​. ఐఆర్​సీటీసీ 4 గంటల అంతరాయం తరువాత టికెట్​ బుకింగ్ సేవలను మళ్లీ పునరుద్ధరించింది. ఈ విషయాన్ని ఐఆర్​సీటీసీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్​లో వెల్లడించింది. ప్రస్తుతం ఐఆర్​సీటీసీ యాప్​ (రైల్​ కనెక్ట్​), ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​ తథాతథంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రయాణికులు ఎదుర్కొన్న అంతరాయానికి చింతిస్తున్నామని ఐఆర్​సీటీసీ విచారం వ్యక్తం చేసింది.

4 గంటల తరువాత
IRCTC Ticket booking issue : మంగళవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తి ఐఆర్​సీటీసీ టికెట్​ బుకింగ్​ సేవలు నిలిచిపోయాయి. దీనితో అత్యవసరంగా రైలు ప్రయాణం చేయాల్సిన వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా తత్కాల్​ టికెట్​ బుకింగ్​ సమయంలో అంతరాయం ఏర్పడడం వల్ల చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాస్తవానికి ఉదయం 10 గంటలకు ఏసీ తరగతి (2A/3A/CC/EC/3E) ఉదయం 11:00 గంటలకు నాన్ ఏసీ తరగతికి (SL/FC/2S) కోసం తత్కాల్ బుకింగ్స్​ ప్రారంభమవ్వగా.. ఐఆర్‌సీటీసీలో టెక్నికల్ సమస్య కారణంగా చాలా మంది టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు. దీనితో ఈ సమస్యపై రైల్వే శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే రంగంలోకి దిగిన సాంకేతిక బృందం 4 గంటలపాటు నిర్విరామంగా కృషి చేసి ఐఆర్​సీటీసీ టెక్నికల్​ సమస్యను పరిష్కరించింది. దీనితో సమస్య పరిష్కారమై, సేవలు అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఐఆర్‌సీటీసీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి!
IRCTC B2C PARTNERS : వాస్తవానికి ట్రైన్​ టికెట్​ బుకింగ్ సేవలను అనేక ఇతర యాప్​లు కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​, పేటీఎం, మేక్ ​మై ట్రిప్ లాంటి బీ2సీ వేదికల ద్వారా రైల్వే టికెట్స్​ బుక్​ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా అనేక యాప్స్​ కూడా రైలు టికెట్లు బుక్​ చేసుకునేందుకు వీలును కల్పిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.