ETV Bharat / business

Gold Rate Today 27th September 2023 : క్రమంగా దిగివస్తున్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 9:30 AM IST

Updated : Sep 27, 2023, 10:42 AM IST

Gold Price Today 27th September 2023
Gold Rate Today 27th September 2023

Gold Rate Today 27th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 27th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,770 ఉండగా.. బుధవారం రూ.245 తగ్గి రూ.60,525కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,600గా ఉండగా.. బుధవారం రూ.610 తగ్గి రూ.72,990కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 27th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,525గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,990గా ఉంది.
  • Gold Price In Vijayawada 27th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,525గా ఉంది. కిలో వెండి ధర రూ.72,990కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 27th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,525గా ఉంది. కిలో వెండి ధర రూ.72,990గా ఉంది.
  • Gold Price In Proddatur 27th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,525గా ఉంది. కిలో వెండి ధర రూ.72,990కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 27th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1914 డాలర్లుగా ఉండగా.. బుధవారం ఏకంగా 14 డాలర్లు తగ్గి 1900 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.78 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 27th September 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,84,350 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,84,350
ఇథీరియంరూ.1,32,433
టెథర్​ రూ.83.18
బైనాన్స్ కాయిన్రూ.17,669
యూఎస్​డీ కాయిన్రూ.83.22

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​
Stock Market Today 27th September 2023 : బుధవారం కూడా దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 339 పాయింట్లు నష్టపోయి 65,602 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 98 పాయింట్లు కోల్పోయి 19,556 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎల్​ అండ్ టీ, మారుతి సుజుకి, రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, టైటాన్​, ఇన్ఫోసిస్​, ఐటీసీ, కోటక్ బ్యాంక్​, ఎస్​బీఐ

రూపాయి విలువ!
Rupee Open 27th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి రూ.83.24 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 27th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 27th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.99 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 94.89 డాలర్లుగా ఉంది.

Cheapest Gold Market In The World : చౌకగా బంగారం కొనాలా?.. ఆ 7 దేశాల్లో డెడ్​ చీప్​గా పసిడి నగలు దొరుకుతాయ్!

How much Gold We Can Buy in Cash? : ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎంత వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు.. పరిమితి దాటితే..!

Gold Buying Tips : బంగారు ఆభరణాలు కొనాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

Last Updated :Sep 27, 2023, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.