ETV Bharat / business

క్రెడిట్ కార్డ్​ వాడుతున్నారా? తెలియకుండానే ఎన్ని ఛార్జీలు వేస్తున్నారో తెలుసా?

author img

By

Published : Mar 5, 2023, 2:12 PM IST

credit card hidden charges
credit card hidden charges

Hidden Charges On Credit Card: చేతిలో డబ్బు లేకపోయినా.. ఏదైనా కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డుతో వెసులుబాటు ఉంటుంది. కానీ అనేక సంస్థలు ఉచితమని చెప్పినా.. అనేక హిడెన్ ఛార్జీలను విధిస్తాయి. అవేంటో తెలుసుకుంటే కార్డు వాడకంపై మనకు అవగాహన వస్తుంది.

Hidden Charges On Credit Card : అవసరానికి డబ్బుల్లేనప్పుడు.. అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు.. వేగంగా మనకు కావల్సిన సొమ్మును అందించే సాధనం క్రెడిట్ కార్డు. చాలా సందర్భాల్లో క్రెడిట్​ వాడకం ఎంతో మంచి చేస్తుంది. కానీ అనేక సంస్థలు హిడెన్ ఛార్జీలను విధిస్తాయి. అందుకోసమే ఒక కార్డును తీసుకునేటప్పుడు వాటి పూర్తి వివరాలు, ఛార్జీలు తెలుసుకోవాలి. ఇలా చేస్తే హిడెన్​ ఛార్జీలను నివారించవచ్చు. వివిధ సంస్థలు ప్రధానంగా విధించే ఛార్జీల గురించి ఇప్పుడు చూద్దాం.

1.మెయింటెనెన్స్​ ఛార్జీ
మనం క్రెడిట్ కార్డును వినియోగించేటప్పుడు అనేక ఛార్జీలను వసూలు చేస్తాయి సంస్థలు. కాకపోతే వీటి వల్ల మనం ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. "చాలా కంపెనీలు.. వార్షిక రుసుములను వసూలు చేసి, దీనికి బదులుగా కొన్ని ప్రయోజనాలను అందిస్తుంటాయి. వీటిలో చాలా వరకూ మనం ఎప్పుడూ వినియోగించుకునేవే ఉంటాయి. హోటల్‌లో బస చేసినప్పుడు రాయితీ, గోల్ఫ్‌ కోర్సులు, విమానాశ్రయాల్లో లాంజ్‌ ప్రవేశంలాంటివి ఇందులో ఉంటాయి" అని SAG ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా తెలిపారు.

మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు జాయినింగ్​ ఛార్జీ కడితే.. ఆ ఏడాది వార్షిక రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు 'మై ఫండ్ బజార్' సీఈఓ వినీత్. కాకపోతే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు.. ఆ కార్డు ఏడాది ఉచితమా..? జీవిత కాలం ఉచితమా..? అన్న విషయాలను ధ్రువీకరించుకుని తీసుకోవాలని సూచించారు.

2. క్యాష్ అడ్వాన్స్ ఛార్జీ
మనం ATMల నుంచి నగదు విత్​డ్రా చేసేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తాం. అయితే క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సంస్థలు మనకు ఛార్జీలు విధిస్తాయి. క్యాష్​ విత్​డ్రా చేసుకున్న సమయం నుంచి వడ్డీని వసూలు చేస్తారు. ఇది విత్​డ్రా చేసిన మొత్తంలో 2.5 శాతం వరకు ఉంటుంది.

3. లేట్ పేమెంట్​ ఛార్జీ
క్రెడిట్​ కార్డ్​ బిల్లును ఆలస్యంగా కడితే జరిమానాలు విధిస్తాయి సంస్థలు. క్రెడిట్ కార్డు బిల్లు పూర్తి మొత్తం చెల్లించకపోయినా లేదా ఆలస్యంగా చెల్లించినా బ్యాంకులు జరిమానా విధిస్తాయని వినీత్​ తెలిపారు. ఇది క్రెడిట్​ స్కోర్​పైనా ప్రభావం చూపుతుందని చెప్పారు.
4. జీఎస్​టీ ఛార్జీ
అన్ని సంస్థల క్రెడిట్ కార్డులపై జీఎస్​టీ వర్తిస్తుంది. క్రెడిట్​ కార్డు లావాదేవీలపై సుమారు 18 శాతం జీఎస్​టీగా వసూలు చేస్తారు.

5. విదేశీ లావాదేవీల ఛార్జీ
మనం ఉపయోగించే క్రెడిట్ కార్డుల్లో అనేక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పనిచేసేలా ఉంటాయి. కాకపోతే విదేశీ లావాదేవీలకు అదనంగా కొంత ఛార్జీలను వసూలు చేస్తారు. లావాదేవీలు జరిపిన మొత్తంలో కొంత శాతాన్ని రూపాయిలోకి మార్చుకుని ఛార్జీగా తీసుకుంటారు. సాధారణంగా విదేశీ లావాదేవీల రుసుము 3 శాతంగా ఉంటుంది. మనం విదేశాల్లో ఉన్న ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ ఛార్జీని చెల్లించాలి.

ఇవీ చదవండి : 'అంబానీ' డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?.. సాఫ్ట్​వేర్ ఉద్యోగం కూడా దిగదుడుపే!

స్టాక్​ మార్కెట్​లో అదానీ జోరు​.. వరుసగా మూడో రోజు లాభాలు.. వారి సంపద రూ.3.4లక్షల కోట్లు జంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.