ETV Bharat / business

'అంబానీ' డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?.. సాఫ్ట్​వేర్ ఉద్యోగం కూడా దిగదుడుపే!

author img

By

Published : Mar 4, 2023, 12:37 PM IST

Updated : Mar 5, 2023, 11:53 AM IST

దాదాపు రూ.7 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు ముకేశ్​ అంబానీ. ప్రస్తుతం ఈ రిచెస్ట్ మ్యాన్​కు సంబంధించి ఓ వార్త చర్చనీయాంశమైంది. ఆయన ఖరీదైన కార్ల డ్రైవర్ల జీతం.. మల్టీనేషనల్​ కంపెనీలో పనిచేసే సాప్ట్​ ఉద్యోగి కన్నా ఎక్కువగా ఉంటుందట. అంబానీ డ్రైవర్ల జీతం ఎంతో తెలుసా?

mukesh ambani car driver salary
mukesh ambani car driver salary

ముకేశ్​ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు. సూమారు రూ.7 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ముకేశ్​ అంబానీ.. తన కుటుంబంతో ముంబయిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస సముదాయమైన 27 అంతస్తుల ఆంటిలియా భవంతిలో ఉంటున్నారు. అయితే, అంబానీ డ్రైవర్​కు సంబంధించిన ఓ వార్చ నెట్టింట్లో చర్చనీయాంశమవుతోంది. అంబానీల కారు డ్రైవర్​ నెల జీతం.. టాప్​ మల్టీనేషనల్​ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్​వేర్ ఉద్యోగుల కన్నా ఎ​క్కువగా ఉంటుందట. అలాంటి అంబానీ ఖరీదైన కార్ల డ్రైవర్ల గురించి, వారి జీత భత్యాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

అంబానీ డ్రైవర్ల జాబ్ అంత సింపుల్​గా ఏమీ ఉండదు. కారు నడపడం ఒక్కటే వీరి బాధ్యత కాదు. ఓ ప్రైవేటు కాంట్రాక్టింగ్​ సంస్థ నుంచి వీరిని తీసుకుంటారు. అప్పటి నుంచి వారి అంబానీల ఇంట్లో ప్రయాణం మొదలవుతుంది. అంబానీల లగ్జరీ లైఫ్​స్టైల్​కు మ్యాచ్​ అయ్యేలా.. వారికి కఠినమైన శిక్షణ ఇస్తారు. కమర్షియల్​, లగ్జరీ వాహనాలను నడపడంలో అన్ని రకాలుగా ట్రైనింగ్​ తీసుకుంటారు. వాహనాల్లోని అదనపు భద్రతా ఫీచర్ల గురించి శిక్షణ ఉంటుంది. అయితే, సాధారణంగా అంబానీలు బుల్లెట్ ప్రూఫ్​ వాహనాల్లోనే వెళ్తారు. కానీ, కొన్ని పరిస్థితుల్లో బండి నడపడమే కాకుండా.. అలాంటి లగ్జరీ కార్లలో ఉన్న ప్యాసింజర్ల రక్షణ, భద్రత కూడా డ్రైవర్ చూసుకోవాలి. కాగా, ఇలాంటి డ్రైవర్లను ఏ ఏజెన్సీ ప్రొవైడ్​ చేస్తుంది అన్న విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతారు. ఇక, అంబానీ ఫ్యామిలీకి పనిచేసే డ్రైవర్ల వ్యక్తిగత వివరాలు కూడా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడతారు.

గతంలో అంబానీకి డ్రైవర్​గా పనిచేసే ఓ వ్యక్తి మాట్లాడిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. అందులో తన శాలరీ నెలకు దాదాపు రూ.2 లక్షలు ఉంటుందని ఆ డ్రైవర్​ వెల్లడించారు. ఇలా అయితే ఏడాదికి కనీసం రూ. 24 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. కాగా, ఇది ఐదేళ్ల క్రితం వచ్చిన వీడియో. ఒకవేళ అతడు చెప్పిందే నిజమైతే.. ఇప్పటికి ఆ జీతం మరింత పెరిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది సాఫ్ట్​వేర్ జాబ్ చేసే చాలా మంది ఉద్యోగుల కన్నా అధికమే. ముకేశ్​ అంబానీకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా అంబానీకి ప్రైవేటు జెట్లు, విలాసవంతమైన నౌకలు ఉన్నాయి. ఇక అంబానీ డ్రైవర్ల శాలరీ విషయంపై సోషల్​ మీడియాలో మీమ్స్, జోక్స్​ పేలుతున్నాయి. ముకేశ్ అంబానీ ఆంటీలియాలా డ్రైవర్ల ఇళ్లు ఈ విధంగా ఉంటాయని చూపిస్తున్నారు. ఇక, బెంజ్ కార్ల లోగోలను డ్రైవర్లు లంచ్​ బాక్స్​లుగా వాడుకుంటారని ఫొటోలు పెడుతున్నారు. టాప్​ సాఫ్ట్​వేర్​ కంపీనీల్లో పనిచేసే ఇంజినీర్ల జీతాల కన్నా.. అంబానీ డ్రైవర్ల సాలరీ ఎక్కువగా ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

  • Kabhi socha hai, Mukesh Ambani's personal driver earns more than the top software engineers from the top multinational companies.

    — Ajay Kareer (@ajaykareer) October 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Mar 5, 2023, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.