ETV Bharat / business

స్టాక్ మార్కెట్ల కొత్త రికార్డు- 55,950పైకి సెన్సెక్స్​

author img

By

Published : Aug 24, 2021, 3:43 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ (Sensex Today) 403 పాయింట్లు పెరిగి.. తొలిసారి 55,950 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty Today) 128 పాయింట్లు బలపడి.. జీవనకాల గరిష్ఠమైన 16,620 మార్క్​ దాటింది.

stocks new record
స్టాక్ మార్కెట్ల రికార్డులు

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డులు సృష్టించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 403 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 55,959 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 128 పాయింట్ల లాభంతో తొలిసారి 16,625 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ సానుకూలతలు, లోహ, ఆర్థిక షేర్ల అండ లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్​.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 56,023 పాయింట్ల అత్యధిక స్థాయి, 55,536 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,647 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,495 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫిన్​సర్వ్​, టాటా స్టీల్​, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ లాభాలను గడించాయి.

నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్​ టెక్​, ఏషియన్​ పెయింట్స్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలూ లాభాలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి: వొడా-ఐడియాకు 43 లక్షల యూజర్లు గుడ్​బై- జియోకు జై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.