ETV Bharat / business

మార్కెట్లకు మళ్లీ నష్టాలు..15వేల దిగువకు నిఫ్టీ

author img

By

Published : May 20, 2021, 3:37 PM IST

stock Market LIVE Updates
మార్కెట్లకు మళ్లీ నష్టాలు..

గురువారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు నష్టాన్ని చూశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 124 పాయింట్లు తగ్గి 15వేల దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా కుదేలయ్యాయి.

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజీ సూచీ- సెన్సెక్స్​ 338 పాయింట్లు కోల్పోయి 49,565 వద్ద స్థిరపడింది. నేషనల్​ స్టాక్​ ఎక్సేంజీ సూచీ-నిఫ్టీ 124 పాయింట్లు కోల్పోయి 14 వేల 906 వద్ద ముగిసింది. బ్యాంకు షేర్లతో పాటు.. విద్యుత్, ఐటీ రంగ​ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 50,099 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి.. 49,497 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

మరో సూచీ నిఫ్టీ 15,070 పాయింట్ల గరిష్ఠాన్ని, 14,885 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభాల్లో, నష్టాల్లోని షేర్లు..

ఎం అండ్ ఎం, ఇండస్​ఇండ్, టైటాన్, ఎల్​ అండ్​ టీ​ షేర్లు స్వల్ప లాభాలను ఆర్జించగా.. ఇతర ప్రధాన కంపెనీల షేర్లన్నీ నష్టాల్లో కొనసాగాయి. ఓఎన్​జీసీ షేరు అధికంగా 3 శాతం మేర నష్టపోయింది.

ఇవీ చదవండి: 'కరోనా నష్టాల్లో 80% ప్రైవేటు రంగానిదే'

బిట్‌కాయిన్‌ ఢమాల్‌.. ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.