ETV Bharat / business

అంతా రెడీ.. విప్రో ఉద్యోగులు ఇక ఆఫీస్​కే!

author img

By

Published : Sep 12, 2021, 3:53 PM IST

Wipro
విప్రో

వర్క్​ ఫ్రం హోం నుంచి ఉద్యోగులను ఆఫీసుకు​ తిరిగి రప్పించేందుకు సిద్ధమైంది కార్పొరేట్​ దిగ్గజం విప్రో. ముందుగా ఉన్నత స్థాయి ఉద్యోగులను సోమవారం నుంచే కార్యాలయాలకు రప్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి వారంతా.. వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీస్​ నుంచి పని చేయనున్నట్లు వివరించింది.

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్​ వేగవంతమవటం వల్ల కార్పొరేట్​ కంపెనీలు వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం విప్రో.. తమ ఉద్యోగులను సోమవారం నుంచి ఆఫీస్ నుంచి పని చేసే విధంగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతానికి ఉన్నత స్థాయి ఉద్యోగులను మాత్రమే ఆఫీస్​కు రప్పించనుంది విప్రో. ఈ విషయాన్ని విప్రో ఛైర్మన్​ రిషద్​ ప్రేమ్​జీ స్వయంగా వెల్లడించారు.

"18 నెలల తర్వాత.. సోమవారం నుంచి మా ఉద్యోగులు ఆఫీస్​కు రానున్నారు (వారంలో రెండు రోజులు మాత్రమే). వారంతా పూర్తిగా వ్యాక్సిన్ వేసుకున్న వారే. సురక్షితంగా, భౌతిక దూరం పాటిస్తూ.. పని చేసేందుకు సర్వం సిద్ధమైంది."

-రిషద్ ప్రేమ్​జీ ట్వీట్​

ఆఫీస్​కు వచ్చే ఉద్యోగుల భద్రతకు సంబంధించి ఓ వీడియోను కూడా షేర్ చేశారు ప్రేమ్​జీ. ఆఫీస్​కు ఎంటర్​ అయ్యే ముందు టెంపరేచర్​ చెక్​, క్యూఆర్​ కోడ్ స్కాన్​ వంటి జాగ్రత్తలు ఎలా పాటిస్తున్నారో అందులో ఉంది.

  • After 18 long months, our leaders @Wipro are coming back to the office starting tomorrow (twice a week). All fully vaccinated, all ready to go - safely and socially distanced! We will watch this closely. pic.twitter.com/U8YDs2Rsyo

    — Rishad Premji (@RishadPremji) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జులైలోనే 55 శాతం మందికి వ్యాక్సినేషన్​..

విప్రో 75వ వార్షికోత్సవం సందర్భంగా జులై 14న నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రిషద్ ప్రేమ్​జీ.. అప్పటికే తమ ఉద్యోగుల్లో 55 శాతం మంది (భారత్​లో) వ్యాక్సిన్​ తీసుకున్నట్లు తెలిపారు. విప్రోలో ప్రస్తుతం మొత్తం 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. కొవిడ్​ ప్రారంభ దశలోనే భారీ సంఖ్యలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్లు వెల్లడించారు. అప్పటికి (జులై నాటికి) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 3 శాతం మంది మాత్రమే ఆఫీసుల్లో పని చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'వర్క్ ఫ్రం హోం ఆపకపోతే నా భర్తకు విడాకులే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.