ETV Bharat / business

రిలయన్స్ ఎం-క్యాప్ @ రూ.14 లక్షల కోట్లు

author img

By

Published : Jul 24, 2020, 1:47 PM IST

reliance m cap new record
రిలయన్స్ షేర్ల దూకుడు

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్సీస్ మార్కెట్ విలువ పరంగా మరో కొత్త రికార్డు స్థాయికి చేరింది. శుక్రవారం సంస్థ షేర్లు 4 శాతానికిపైగా పెరిగి.. ఎం-క్యాప్ రూ.14 లక్షల కోట్ల మార్క్​ను దాటింది.

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్​ఐఎల్​) మరో కొత్త రికార్డు నెలకొల్పింది. సంస్థ షేర్లు శుక్రవారం 4 శాతం పుంజుకుని 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి.

షేర్ల దూకుడుతో.. శుక్రవారం ఒక్క రోజే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) రూ.53,821 కోట్లు పెరిగి..రూ.14,07,854.41 కోట్ల మార్క్ దాటింది. ఇంతటి ఎం-క్యాప్ ఉన్న ఏకైక భారతీయ లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే.

జియో మార్ట్​లో అమెజాన్ ఇండియా పెట్టుబడులు పెట్టనుందన్న వార్తలతో రిలయన్స్ షేర్లు ఈ స్థాయిలో లాభాలను గడించాయి.

శుక్రవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా.. రిలయన్స్ మాత్రం లాభాలను నమోదు చేయడం గమనార్హం.

2,3 స్థానాల్లోని కంపెనీలు..

ఆర్​ఐఎల్​ తర్వాత ఎం-క్యాప్ పరంగా టీఎసీఎస్ రూ.8,07,419.38 కోట్లతో రెండో స్థానంలో ఉంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ రూ.6,11,095.46 కోట్ల ఎం-క్యాప్​తో మూడో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి:టాప్​ 50 కంపెనీల్లో రిలయన్స్​కు చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.