ETV Bharat / business

నేటి నుంచి అవి పనిచేయవ్- కొత్త రూల్స్ ఇవే...

author img

By

Published : Jun 30, 2021, 2:59 PM IST

Updated : Jul 1, 2021, 9:26 AM IST

మీకు బ్యాంకు ఖాతా ఉందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. జులై 1 నుంచి ఎన్నో మార్పులు రానున్నాయి. కొన్ని బ్యాంకులు తమ సర్వీస్​ ఛార్జీలు పెంచగా.. మరికొన్ని ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లే చెల్లవని చెప్పాయి. మరి ఏఏ బ్యాంకులు ఏం మార్పులు చేశాయో, కస్టమర్లు ఏం చేయాలో తెలుసుకోండి.

7 crucial changes to come into effect from July 1
బ్యాంకు సేవల్లో మార్పులు

బ్యాంకు ఖాతాదారులంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. జులై 1 నుంచి ఏటీఎంలో నగదు ఉపసంహరణ మొదలుకొని.. కొత్త ఐఎఫ్​ఎస్​ఎస్​ కోడ్​ల వరకు ఎన్నో మార్పులు రానున్నాయి. ఏఏ బ్యాంకులు ఏం మార్పులు చేయనున్నాయంటే..

జులై 1 నుంచి వచ్చే మార్పులివే..

ఎస్​బీఐ ఛార్జీలు పెంపు

నగదు ఉపసంహరణ సేవల్లో పలు మార్పులు చేసింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. తమ బ్యాంకు ఏటీఎంల నుంచి నాలుగు లావాదేవీలు మాత్రమే ఉచితంగా చేసుకునే వీలు కల్పించనుంది. ఆ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్​కు రూ. 15 (జీఎస్​టీ అదనం) వసూలు చేయనుంది.

చెక్కులు బాగా వాడతారా?

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్​బీఐ.. సేవింగ్స్​ ఖాతాదారులకు షాక్​ ఇచ్చింది. చెక్​ బుక్​ వినియోగంపై పరిమితులు విధించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 10 చెక్కులను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఇంకా కావాలాంటే.. అదనంగా ఛార్జీలు విధించనుంది.

  • 10 చెక్స్​- రూ.40+ జీఎస్​టీ
  • 25 చెక్స్- రూ. 75+జీఎస్​టీ

సీనియర్​ సిటిజన్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.

యాక్సిస్​ బ్యాంకు వినియోగదారులా?

సేవింగ్స్​ ఖాతాదారులకు పలు సర్వీస్​ ఛార్జీలను పెంచింది యాక్సిస్​ బ్యాంకు. ఇప్పటికే వీటిలో కొన్ని మే 1 నుంచి అమల్లోకి రాగా.. సవరించిన మరికొన్ని జులై 1 నుంచి అమలుకానున్నాయి. ఇందులో భాగంగా.. ఎస్​ఎంఎస్​ అలర్ట్​కు కూడా డబ్బులు వసూలు చేయనుంది యాక్సిస్ బ్యాంక్. టెలికాం శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

  • ఒక్క అలర్ట్​కు రూ. 25 పైసల చొప్పున గరిష్ఠంగా నెలకు 25 రూపాయల వరకు ఛార్జీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది నెలకు రూ. 5గా ఉండేది.
  • ప్రమోషనల్​ మెసేజ్​లు, వన్​ టైం పాస్​వర్డ్​ ఓటీపీలకు ఎలాంటి ఛార్జీ చేయబోమని స్పష్టం చేసింది.
  • సేవింగ్స్​ అకౌంట్​లో ఉండాల్సిన కనీస మొత్తాన్ని కూడా పెంచింది.

దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిస్​ బ్యాంక్​కు.. 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు.

సిలిండర్​ ధరల పెంపు..

ఎల్​పీజీ సిలిండర్ల ధరలు.. ప్రతి నెలా మొదటి రోజే నిర్ణయిస్తారు. ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. జులై 1 నుంచి ఈ ధరలు పెరుగుతాయని తెలుస్తోంది.

పన్ను చెల్లించలేదా?

గత రెండేళ్లుగా పన్ను చెల్లింపులు చేయని వారికి.. టీడీఎస్​ రేట్లు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇది జులై నుంచే అమల్లోకి రానుంది.

కొత్త చెక్​బుక్స్​..

యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో వీలినమైన ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్​ బ్యాంక్​ ఖాతాదారులు కొత్త చెక్​ బుక్​లు తీసుకోవాలని సూచించింది. పాతవి జులై 1 నుంచి చెల్లవని స్పష్టం చేసింది.

ఆ ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లు బంద్​!

సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులంతా వెంటనే తమ ఐఎఫ్​ఎస్​సీ కోడ్, చెక్​బుక్​లు అప్​డేట్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ సూచించింది. సిండికేట్ బ్యాంక్ గత ఏడాది కెనరా బ్యాంక్​లో విలీనమైన కారణంగా.. పాత ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లు, చెక్​ బుక్​లు జులై 1 నుంచి చెల్లవని స్పష్టం చేసింది.

ఈ విషయమై ఇప్పటికే సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులందరికీ ఎస్ఎంఎస్​ ద్వారా సమాచారమిచ్చినట్లు వెల్లడించింది.

ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లో మార్పు ఎందుకు?

బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 2019లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మెగా విలీనం 2020 ఏప్రిల్​ నుంచి అమలులోకి వచ్చింది.

  • ఈ ప్లాన్​లో భాగంగా సిండికేట్ బ్యాంక్​ కెనరా బ్యాంక్​లో విలీనమైంది. దీంతో సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్​ఎస్​సీ కోడ్ స్థానంలో తమ బ్యాంక్​ ఐఎఫ్​ఎస్​సీ కోడ్​ను వినియోగంలోకి తీసుకొస్తోంది కెనరా బ్యాంక్.
  • ఇంకా కార్పొరేషన్​ బ్యాంక్​, ఆంధ్రా బ్యాంక్​.. యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో విలీనమయ్యాయి.

ఐఎఫ్​ఎస్​సీ కోడ్ అంటే?

ఐఎఫ్ఎస్​సీ అంటే.. ఇండియన్​ ఫినాన్షియల్​ సిస్టమ్​ కోడ్. ఇందులో ఇంగ్లీష్​ ఆల్ఫాబెట్స్​తో కలిపి మొత్తం 11 అంకెలు ఉంటాయి. ఒకే బ్యాంక్​ అయినప్పటికీ ప్రతి శాఖకు ఈ కోడ్​ ప్రత్యేకంగా ఉంటుంది. నెఫ్ట్​, ఆర్​టీజీఎస్​, ఐఎంపీఎస్​ ద్వారా నగదు బదిలీకి ఈ కోడ్​ తప్పనిసరి.

పెరగనున్న 'హీరో' ధరలు..

జులై 1 నుంచి.. స్కూటర్లు, మోటార్​ సైకిళ్ల ఎక్స్​ షోరూం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది హీరో మోటార్స్​. ముడిసరకుల ధరలు పెరగడమే ఈ నిర్ణయానికి కారణమని వివరించింది.

ఇవీ చదవండి: ఏటీఎం లావాదేవీలు ఇక మరింత భారం

ఈ బ్యాంక్​ల ఏటీఎంలు ఎన్నిసార్లు వాడినా ఫ్రీ!

Bank Holidays: జులైలో బ్యాంక్ సెలవులు ఇవే

Last Updated :Jul 1, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.