ETV Bharat / business

ఉద్యోగంలో గ్యాప్​ వచ్చిందా.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మీకోసమే!

author img

By

Published : Sep 9, 2021, 12:45 PM IST

TCS
TCS

టాటా గ్రూప్​కు చెందిన ఐటీ సేవల విభాగం టీసీఎస్ (TCS)​ అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్​ను ప్రారంభించింది. 'తమను తాము నిరూపించుకోవడానికి అందివచ్చిన అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని' టీసీఎస్ పిలుపునిచ్చింది.

కెరియర్​లో తాత్కాలిక​ విరామం అనంతరం ఉద్యోగం చేయాలనుకునే మహిళా అభ్యర్థులకు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) (Tcs Careers) శుభవార్త చెప్పింది. మహిళా నిపుణుల కోసం అతిపెద్ద 'రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌'ను (Tcs Recruitment 2021) ప్రారంభించింది.

"ఓ వ్యక్తిలో నైపుణ్యాలు, సామర్థ్యం అనేవి ఎప్పుడూ ఉంటాయి. ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన మహిళా నిపుణుల్లో స్ఫూర్తి నింపడమే కాకుండా.. వారిలోని టాలెంట్​ను ఆవిష్కరించడానికి ఇదొక గొప్ప అవకాశం."

- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

'వారికొక గుర్తింపు..'

'మహిళల్లోని ప్రత్యేక నైపుణ్యాలు ప్రపంచాన్ని మార్చగలవు. వారి ప్రతిభను టీసీఎస్ గౌరవిస్తుంది. ప్రతిభావంతులైన ఔత్సాహికుల కోసం ఈ ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని రూపొందించినట్లు' టీసీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా తమ సంస్థలో అందుబాటులో ఉన్న పలు ఉద్యోగాల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.

"ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో నేర్చుకోవడం అనేది స్థిరంగా ఉంటుందని మేం నమ్ముతున్నాం. ప్రస్తుత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా.. మీ కెరియర్​లో​ మరింత ప్రత్యేకంగా ఎదగడానికి ఇదో గొప్ప అవకాశం. అలాగే సామూహిక ఆవిష్కరణలు, జ్ఞానం ద్వారా గొప్ప భవిష్యత్తును నిర్మించాలని సంస్థ భావిస్తోంది. అందువల్ల మీ అనుభవం, ఆలోచనలు.. ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు వినూత్న మార్గాన్ని అందిస్తాయని టీసీఎస్ నమ్ముతోంది.''

-టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

అర్హతలు ఏంటి?

గ్రాడ్యుయేషన్​/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన అభ్యర్థులు టీసీఎస్ రిక్రూట్​మెంట్​కు (Tcs Recruitment 2021) అర్హులు. వీరికి 2-5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం(Tcs Recruitment for Experienced) కలిగి ఉండాలి.

దరఖాస్తు ఎలా..?

ఆసక్తి గల నిపుణులు వారి వారి నైపుణ్యాలకు అనుగుణంగా దరఖాస్తు (Tcs Careers 2021 Registration) చేసుకోవాలి. అనంతరం అర్హుల జాబితాను రూపొందించి ఇంటర్వ్యూ వివరాలను ఈ-మెయిల్​ చేస్తామని టీసీఎస్ పేర్కొంది.

కావాల్సిన నైపుణ్యాలు ఏంటి?

  • ఎస్​క్యూఎల్(SQL) సర్వర్ డీబీఏ(DBA)
  • లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్
  • నెట్‌వర్క్ అడ్మిన్
  • మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్
  • ఆటోమేషన్ టెస్టింగ్
  • పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్
  • యాంగులర్ జేఎస్(Angular JS)
  • ఒరాకిల్ డీబీఏ(DBA)
  • సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్
  • జావా డెవలపర్
  • డాట్ నెట్ డెవలపర్
  • ఆండ్రాయిడ్ డెవలపర్
  • ఐఓఎస్(IOS) డెవలపర్
  • విండోస్ అడ్మిన్
  • పైథాన్ డెవలపర్
  • పీఎల్​ఎస్​క్యూఎల్(PLSQL)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.