ETV Bharat / bharat

ఐటీలో ఫ్రెషర్స్​కి​ భారీ ఆఫర్లు- ప్యాకేజీలు ఎంతంటే..

author img

By

Published : Jul 25, 2021, 12:04 PM IST

టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్ టెక్​​​ వంటి కంపెనీలు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాలను ప్రకటించాయి. అయితే వాటికి అర్హులు ఎవరు? ఫ్రెషర్స్​తో పాటు ఎక్స్​పీరియన్స్ ఉన్న​ వాళ్లకు అవకాశాలు ఉన్నాయా? ఏ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం? ప్యాకేజీలు ఎలా ఉంటాయి? అనే వివరాలు తెలుకుందాం.

What Qualifications need for IT jobs
ఐటీ ఉద్యోగాలకు అర్హతలు ఏమిటి

దేశంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్​సీఎల్​ టెక్​ లాంటి కంపెనీలు ఐటీ రంగంలో చాలా ప్రధానమైనవి. వీటిలో ఉద్యోగం సాధించాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారికి ఈ కంపెనీలన్నీ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పాయి. ఈ సారి భారీ స్థాయిలో క్యాంపస్ నియామాకాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. మొత్తం అన్ని కంపెనీలు కలిపి 1.1 లక్షల మందిని నియమించుకోనున్నట్లు తెలిపాయి.

కంపెనీల వారీగా వివరాలు..

సరాసరి నియమకాలు ఈ సారి 30 శాతం పెరగనునట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫోసిస్ 35వేల మంది కొత్త వారిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ 21 వేల నియామకాలు మాత్రమే చేపట్టింది. విప్రో 12 వేల ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇది గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 33 శాతం అధికం.

హెచ్​సీఎల్ టెక్ 20 వేల నుంచి 22 వేల వరకు నియామకాలకు సిద్ధమైంది. ఈ కంపెనీ గతేడాది 14.6 వేల మందిని నియమించుకుంది.

టీసీఎస్ గతేడాది తరహాలోనే 40వేల కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. జూన్​తో ముగిసిన త్రైమాసికంలో భారీ స్థాయిలోనే ఈ కంపెనీలు నియామకాలు చేపట్టినట్లు సమాచారం.

అర్హతలు? ప్యాకేజీ..

  • ఈ ఉద్యోగాల విషయంలో అర్హతలను ఉద్యోగాల నియామకం సమయంలోనే ప్రకటిస్తాయి సంస్థలు. అయితే కంపనీలు ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే ఇందులో ఫ్రెషర్స్​కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవనం ఉన్న వారికి సంబంధించినవి తక్కువ సంఖ్యలో ఉండొచ్చు.
  • సాధారణంగా అన్ని కంపెనీలు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ కోర్సుల వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో కంపెనీని బట్టి.. ప్రాధాన్యతలు మారుతుంటాయి. బీఎస్సీ కంప్యూటర్స్ చేసినవాళ్లకు కూడా ఈ కంపెనీలు అవకాశాలు ఇస్తుంటాయి.
  • సాధారణంగా క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే.. చివరి సంవత్సరంలో ఉన్న వారిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి కంపెనీలు. అకాడమిక్స్​లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలనే షరతు పెడుతుంటాయి. అయితే ఈ విషయంలోనూ అన్ని కంపెనీలు ఒకే విధంగా వ్యవహరించవు. కొన్ని కంపెనీలు ఎక్కువ పర్సెంటేజ్/జీపీఏ ఉండాలనే నిబంధన పెడుతుంటాయి.
  • ప్యాకేజీ కూడా కంపెనీని బట్టి మారుతుంటుంది. అదే విధంగా ఎంపికైన అందరికి ఒకే వేతన ప్యాకేజీ అందకపోవచ్చు. టీసీఎస్ కంపెనీలో ఫ్రెషర్స్ వేతనం రూ.1.9 లక్షల నుంచి రూ.3.7 లక్షల వరకు ఉంటుందని ఉద్యోగ కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. నైపుణ్యం ఎక్కువగా ఉన్న వారికి ప్యాకేజీ కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నాయి.

ప్రాంగణ నియామకాలు లేని వారికి?

ప్రాంగణ నియామకాలు లేని వారికి కొన్ని కంపెనీలు ఆఫ్​ క్యాంపస్ ప్లేస్మెంట్​కు అవకాశం ఇస్తున్నాయి. టీఎసీఎస్​నే తీసుకుంటే ప్రతి ఏటా ఈ ఆఫ్​ క్యాంపస్ నియామకాలను చేస్తోంది. దీనికి బీఈ/బీటెక్ పూర్తి చేసిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.