ETV Bharat / business

పేటీఎంలో 20 వేల ఉద్యోగాలు- వారికే ప్రాధాన్యం!

author img

By

Published : Aug 1, 2021, 3:12 PM IST

ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్​ఫామ్​ పేటీఎం భారీగా కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు, కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి ఈ ఉద్యోగాలను ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Jobs in Paytm
పేటీఎంలో ఉద్యోగాలు

డిజిటల్ పేమెంట్, ఫిన్​ టెక్ కంపెనీ పేటీఎం భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. చిన్న వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్​ను స్వీకరించేలా శిక్షణ ఇచ్చేందుకుగానూ.. దేశవ్యాప్తంగా మొత్తం 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్​లను​ (ఎఫ్​ఎస్​ఈ) నియమించుకోనున్నట్లు తెలిసింది.

10వ తరగతి, ఇంటర్​, డిగ్రీ పూర్తి చేసిన యువతను అర్హత ఆధారంగా ఉద్యోగంలోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా చిన్న పట్టణాలలో ఉపాధి పెరుగుతుందని.. ముఖ్యంగా కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇది మంచి అవకాశం కానుందని ఆయా వర్గాలు చెప్పాయి.

మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు.. అధికంగా మహిళా సిబ్బందిని నియమించుకునే యోచనలో పేటిఎం ఉందని తెలిసింది. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం.. ఎఫ్​ఎస్​ఈ సిబ్బంది వేతనం, కమీషన్ల రూపంలో నెలకు రూ.35 వేలు అంతకన్నా ఎక్కువ మొత్తం సంపాదించే వీలుందని సమాచారం.

ఐపీఓ అప్పుడే?

పేటీఎం త్వరలో ఐపీఓకు వచ్చేందుకు కూడా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. రూ.16,600 కోట్ల విలువైన ఐపీఓ కోసం.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఇందుకు సెబీ అనుమతి లభిస్తే.. అక్టోబర్​లో పేటీఎం ఐపీఓ ఉండొచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: 4 నెలల్లో రూ.31 లక్షల కోట్ల సంపద వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.