ETV Bharat / business

ఆర్థిక షేర్ల అండతో సెన్సెక్స్ 409 పాయింట్లు ప్లస్

author img

By

Published : Jul 9, 2020, 9:35 AM IST

Updated : Jul 9, 2020, 3:48 PM IST

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు

15:41 July 09

భారీ లాభాలు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో సెషన్ ముగించాయి. సెన్సెక్స్ 409 పాయింట్లు పుంజుకుని 36,738 వద్దకు చేరింది. నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో 10,813 వద్ద స్థిరపడింది. ఆర్థిక షేర్ల అండ గురువారం లాభాలకు ప్రధాన కారణం.

  • బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫిన్​సర్వ్​ రాణించాయి.
  • ఓఎన్​జీసీ, టెక్ మహీంద్రా, మారుతీ, టీసీఎస్, హెచ్​యూఎల్, ఐటీసీ, నెస్లే నష్టపోయాయి.

13:31 July 09

కొనసాగుతున్నజోరు..

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత భారీ లాభాల దిశగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 330 పాయింట్లకుపైగా లాభంతో 36,665 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా వృద్ధితో 10,794 వద్ద కొనసాగుతోంది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ కూడా లాభాల్లో ట్రేడవుతుండటం.. దేశీయ సూచీలకు కలిసొస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

  • హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టెక్ మహీంద్రా, మారుతీ, ఐటీసీ, ఓఎన్​జీసీ, టీసీఎస్​, టైటాన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

11:38 July 09

36 వేల 550 మార్కు దాటిన సెన్సెక్స్​...

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ ముందు మోస్తరు లాభాలతో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లకుపైగా వృద్ధితో 36,580 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లకుపైగా లాభంతో 10,770 వద్ద కొనసాగుతోంది.

  • ఆర్థిక షేర్లు ప్రధానంగా లాభాలకు ఊతమిస్తున్నాయి.
  • బజాజ్ ఫినాన్స్, టాాటా స్టీల్, బజాజ్ ఫిన్​సర్వ్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలు గురువారం ప్రకటించనున్న నేపథ్యంలో టీసీఎస్​​ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. సంస్థ ఫలితాలపై వెలువడుతున్న ప్రతికూల అంచనాలు ఇందుకు కారణం. టెక్​ మహీంద్రా, మారుతీ, టైటాన్, ఓఎన్​జీసీ, ఐటీసీలూ నష్టాల్లో ఉన్నాయి.

09:56 July 09

లాభాల జోరు..

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా లాభంతో 36,549 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 60 పాయింట్లు పుంజుకుని 10,764 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​యూఎల్​, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • మారుతీ, టెక్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్​, ఐటీసీ, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:01 July 09

నష్టాల నుంచి తేరుకున్న సూచీలు

స్టాక్ మార్కెట్లు చివరి సెషన్ నష్టాల నుంచి తేరుకుని గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా బలపడి 36,513 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల వృద్ధితో 10,755 వద్ద కొనసాగుతోంది.

  • బ్యాంకింగ్, లోహ, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.
  • ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఐటీసీ, టెక్​ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Last Updated :Jul 9, 2020, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.