ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు ఆర్​బీఐ జోష్- 58,600 పైకి సెన్సెక్స్​

author img

By

Published : Dec 8, 2021, 9:30 AM IST

Updated : Dec 8, 2021, 3:47 PM IST

Stock Market Live Update
Stock Market Live Update

15:38 December 08

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మార్కెట్లను పరుగులు పెట్టించాయి. దీంతో స్టాక్​మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగా ఆర్థిక షేర్లు లాభపడ్డాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1016 పాయింట్లు లాభంతో 58,649 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 239 పాయింట్ల వృద్ధితో 17,470 వద్ద ముగిసింది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో.. పవర్ గ్రిడ్​, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు మాత్రమే నష్టపోయాయి.

10:55 December 08

వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆర్థిక రంగ షేర్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో బీఎస్​ఈ సెన్సెక్స్​ 834 పాయింట్లు బలపడి 58,467 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ కూడా 241 పాయింట్లు వృద్ధి చెంది 17,417 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది.

30 షేర్ల ఇండెక్స్​లో మారుతీ, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:15 December 08

స్టాక్​ మార్కెట్ లైవ్ అప్​డేట్స్​

Stock Market Live Updates: స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు, ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష ఫలితాలు అనుకూలంగా ఉంటాయని మదుపర్లు భావిస్తుండటం మార్కెట్లను పరుగులు పెట్టిస్తోంది. దీంతో సెన్సెక్స్ 738 పాయింట్లు వృద్ధి చెంది 58,372కి చేరింది. నిఫ్టీ 204 పాయింట్లు మెరుగుపడి 17,381 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఒఎన్​జీసీ, విప్రో, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి.

దివిస్ ల్యాబ్ షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి.

Last Updated : Dec 8, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.