ETV Bharat / business

దిగొచ్చిన పెట్రోల్​, డీజిల్​- నేటి ధరలు ఇలా..

author img

By

Published : Mar 2, 2020, 1:39 PM IST

Updated : Mar 3, 2020, 12:53 PM IST

crude
పెట్రోల్​ ధరలు

దేశీయంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు లీటర్​కు 20 పైసల మేర తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ.. భారత్​లో మాత్రం తగ్గుముఖం పట్టాయి. దేశంలో వివిధ నగరాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు నేటి ధరలు ఇలా..

ఉత్పత్తి తగ్గింపు కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. భారత్​లో పెట్రోల్ ధరలు సోమవారం తగ్గముఖం పట్టాయి. పెట్రోల్​పై 22-23 పైసలు, డీజిల్​పై​ 20-21 పైసలు తగ్గాయి.

crude
వివిధ నగరాల్లో ఇంధన ధరలు

కరోనా వైరస్​ కారణంగా..

అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్​ చమురు ధర 1.8 శాతం పెరిగి రూ.51.41 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్​ వ్యాప్తితో డిమాండ్​ తగ్గిన కారణంగా ఉత్పత్తిని తగ్గిస్తోంది సౌదీ అరేబియా. రోజుకు 10లక్షల బ్యారెళ్లకు కోత పెడుతోంది.

80 శాతం దిగుమతులే..

దేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ క్రూడ్​ ధరలతో పాటు రూపాయి మారకంపై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే భారత్​ 80 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది.

దేశీయ పెట్రోల్​, డీజిల్​ ధరలను ఆయిల్​ కంపెనీలు రోజువారీగా నిర్ణయిస్తాయి.

Last Updated :Mar 3, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.