ETV Bharat / business

'పన్నుల కన్నా నోట్ల ముద్రణే మేలు'

author img

By

Published : Aug 6, 2021, 7:24 AM IST

ప్రజలపై పన్నులు వేయడం కన్నా.. నోట్లను ముద్రించడం ఉత్తమమైన పని అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్​ అవార్డు గ్రహీత అభిజిత్​ బెనర్జీ అన్నారు. అమెరికా, ఐరోపా దేశాలు ఇదే పనిచేస్తున్నాయని వివరించారు.

Abhijit Banerjee
అభిజిత్​ బెనర్జీ

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై పన్నుల భారం వేయకుండా, నోట్లను ముద్రించడమే సరైన మార్గమని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఇంధనం, ఇతర వస్తువులపై కేంద్రం పదేపదే సెస్సులు పెంచడంపై గురువారం ఆయనను ప్రశ్నించినప్పుడు అది సరైన విధానం కాదని అన్నారు.

బడ్జెట్‌ లోటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, కానీ ఆర్థిక రంగ పురోగతి మందగించినందున ప్రభుత్వమే విరివిగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అమెరికా, ఐరోపా దేశాలు ఇదే పనిచేస్తున్నాయని తెలిపారు. నోట్లు ముద్రించి ఖర్చు పెట్టడం ద్వారా ప్రజల ఉపాధి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అధికమవుతుందని అన్నారు.

ఇదీ చూడండి: క్యాబ్‌ డ్రైవర్‌ చెంప దెబ్బ ఘటనలో ట్విస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.