ETV Bharat / business

జియోలో కొత్త ఫీచర్​- వాట్సాప్​లోనే అన్ని సేవలు!

author img

By

Published : Jun 9, 2021, 6:37 PM IST

రిలయన్స్ జియో మరిన్ని అదిరే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడం, పేమెంట్లు, రీఛార్జ్​ వంటి సేవలను వాట్సాప్​ ద్వారానే పొందొచ్చని ప్రకటించింది. మరి ఈ సేవలు ఎలా పొందాలో తెలుసుకుందాం.

New Services Jio users With WhatsApp
జియో యూజర్లకు కొత్త సేవలు

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరిన్ని అద్భుతమైన సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ఛాట్ బాట్​ ద్వారా.. వ్యాక్సిన్ సమాచారం తెలుసుకోవడం, మొబైల్ రీఛార్జ్​ (ఇతర నంబర్లకు కూడా), పేమెంట్స్​ వంటివి ఇందులో ఉన్నాయి.

ఈ సేవలు పొందటం ఎలా?

7000770007 నంబర్​కు వాట్సాప్​లో 'Hi' అని మెసేజ్ పంపితే ఓ మెనూ వస్తుంది. అందులో యూజర్​కు కావాల్సిన ఆప్షన్​ను ఎంచుకుని ఆ సేవలు పొందొచ్చు.

Jio New Services
జియో కొత్త సేవలు..

ప్రస్తుతం వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో యూజర్లు టీకా సమాచారాన్ని సులభంగా వాట్సాప్​ ద్వారానే తెలుసుకోవచ్చని పేర్కొంది జియో. మొబైల్‌ పోర్టబిలిటీ, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, జియోమార్ట్‌ వంటి సేవలను కూడా పొందొచ్చని వెల్లడించింది. ఇతర మొబైల్ నెట్​వర్క్ యూజర్లూ ఈ సదుపాయం వినయోగించుకోవచ్చని వివరించింది జియో. అయితే ఇందుకు వెరిఫికేషన్ అవసరమవుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:కుబేరులే కానీ.. ఆదాయపు పన్ను చెల్లించరట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.