ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం ధర

author img

By

Published : Dec 10, 2020, 4:07 PM IST

Gold declines Rs 534; silver tanks Rs 628
భారీగా తగ్గిన పసిడి ధర-నేటి లెక్కలివే

పసిడి, వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.534 తగ్గింది. కిలో వెండిపై రూ.628 తగ్గి.. రూ.63 వేల దిగువకు చేరింది.

బంగారం ధర గురువారం రూ.534 తగ్గగా.. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి రూ.48,652కు చేరింది.

పసిడి బాటలో పయనించిన వెండి.. కిలోకు రూ.628 తగ్గి.. రూ.62,711కు దిగొచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం 1,835 డాలర్లు ఉండగా... వెండి 23.84 డాలర్లు పలుకుతోంది.

టీకాపై ఆశలతో పాటు అమెరికా ఉద్దీపన చర్యలపై జరిగిన చర్చల వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు డీలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.