ETV Bharat / business

అంతర్జాతీయ పరిణామాలే మార్కెట్లకు కీలకం!

author img

By

Published : Feb 14, 2021, 1:37 PM IST

share market updates
షేర్ మార్కెట్​ అప్​డేట్స్​

అంతర్జాతీయ పరిణామాలే ఈవారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ మదుపరుల స్పందన కూడా మార్కెట్లకు కీలకమని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సర క్యూ3 ఫలితాల ప్రకటన దాదాపుగా ముగిసింది. ఈ నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లపై ఈ వారం అంతర్జాతీయ పరిణామాల ప్రభావమే కీలకంగా ఉండనుందని విశ్లేషకులు అంటున్నారు. విదేశీ మదుపరుల స్పందన, దేశీయ మదుపరుల సెంటిమెంట్​ మార్కెట్లను ముందుకు నడిపించనున్నట్లు చెబుతున్నారు.

సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చేలా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మార్కెట్లు ఇటీవల భారీగా పుంజుకున్నాయి. ఫలితంగా కొంత ఏకీకరణకు అవకాశం ఉన్నట్లు జియోజిత్​ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్​ నాయర్ అంచనా వేస్తున్నారు.

వీటన్నింటితోపాటు రూపాయి కదలికలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి:ఆగని పెట్రో మంట.. వరుసగా ఆరోరోజూ ధరల పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.