ETV Bharat / briefs

ఆఫీసులో కాల్పులు- నలుగురు మృతి

author img

By

Published : Apr 1, 2021, 10:12 AM IST

Updated : Apr 1, 2021, 10:19 AM IST

California office building shooting kills 4, including child
కాలిఫోర్నియాలో కాల్పులు- నలుగురు మృతి

కాలిఫోర్నియాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ రెండంతస్తుల భవనంపై దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా- దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ కార్యాలయ భవనంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా.. నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు గాయపడినట్టు వెల్లడించారు. అనంతరం.. నిందితుడిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

లాస్​ఏంజలెస్​కు దక్షిణాన ఆరెంజ్​లోని ఓ రెండంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: 'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పంచుకున్న నాసా

Last Updated :Apr 1, 2021, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.