ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. 50 మందితో వెళ్తూ లోయలో పడ్డ పెళ్లి బస్సు.. ఆరుగురు మృతి

author img

By

Published : Oct 4, 2022, 9:00 PM IST

Updated : Oct 4, 2022, 10:33 PM IST

Uttarakhand road accident
Uttarakhand road accident

20:54 October 04

ఘోర రోడ్డు ప్రమాదం.. 50 మందితో వెళ్తూ లోయలో పడ్డ పెళ్లి బస్సు.. ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్​ పౌరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిఖినికల్- బిరోఖాల్ రహదారిపై వెళ్తున్న ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతున్న నాయర్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారి కోసం రెస్క్యూ టీమ్ సభ్యులు గాలిస్తున్నారు. ఈ బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు. అయితే చీకటి కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోందని వెల్లడించారు. ఘటనాస్థలిలో వెలుతురు కోసం స్థానికులు తమ ఫోన్​ ఫ్లాష్​లైట్లను వేసి లోయలో పడినవారి కోసం వెతుకుతున్నారని చెప్పారు.

Last Updated : Oct 4, 2022, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.