ETV Bharat / bharat

యూపీ ఎన్నికలు సమాప్తం.. చివరి విడతలో 54% ఓటింగ్!

author img

By

Published : Mar 7, 2022, 6:01 PM IST

UP ELECTION
UP ELECTION

UP assembly election 2022: యూపీ చివరి దశ ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో విడతలో 54 స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 54.18 శాతం ఓటింగ్ నమోదైంది.

UP assembly election 2022: ఉత్తర్​ప్రదేశ్ చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడతలో పూర్వాంచల్​లోని 54 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 వరకు కొనసాగింది. చందౌలీ నియోజకవర్గంలోని చకియా, సోన్​భద్రలోని రాబర్ట్స్​గంజ్, దుద్ది ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 54.18 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

UP election final phase:

ఎన్నికలు జరిగిన 54 స్థానాల్లో 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాని మోదీ లోక్​సభ నియోజకవర్గమైన వారణాసిలోనూ ఈ విడతలోనే ఎన్నికలు జరిగాయి. మొత్తం 2.06 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్నారు.

దీంతో, 403 స్థానాలు ఉన్న యూపీ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి.

కీలక నేతలు..

చివరి దశ పోలింగ్​లో ఉత్తర్​ప్రదేశ్​ పర్యటక శాఖ మంత్రి నీల్​కంఠ్​ తివారీ బరిలో ఉన్నారు. ఈయన వారణాసి సౌత్​ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మరోవైపు శివ్​పుర్​-వారణాసి నియోజకవర్గం నుంచి అనిల్ రాజ్‌భర్, వారణాసి నార్త్​ నుంచి రవీంద్ర జైస్వాల్, జౌన్​పుర్​ నియోజకవర్గం నుంచి గిరీష్ యాదవ్, మిర్జాపుర్​ నుంచి రామశంకర్ సింగ్ పటేల్ పోటీ చేశారు. కేబినెట్​ మంత్రి పదవికి రాజీనామా చేసి ఎస్​పీలో చేరిన ధారాసింగ్​ చౌహాన్​.. ఘోశి నుంచి బరిలో నిలిచారు.

ఇదీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికపై.. ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఎంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.