ETV Bharat / bharat

ఎమ్మెల్యే నామినేషన్​ తిరస్కరణ.. ఆప్​ నేత ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Jan 25, 2022, 5:39 AM IST

UP Assembly Election 2022: ఉత్తర్​ప్రదేశ్​లో శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నామినేషన్​ తిరస్కరించారని ఆమ్​ ఆద్మీ పార్టీ నేత ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ముజఫర్​నగర్​ జిల్లాలో జరిగింది.

Joginder Singh
జోగిందర్ సింగ్

UP Assembly Election 2022: శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ముజఫర్​నగర్​ జిల్లాలో ఎమ్మెల్యే నామినేషన్​ తిరస్కరించారని ఆమ్​ ఆద్మీ పార్టీ నేత ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరించారు.

ఇదీ జరిగింది..

మిరాంపుర్ అసెంబ్లీ సీటు ఆయనకే దక్కుతుందని ఆప్​ నేత జోగిందర్ సింగ్ ధీమాతో ఉన్నారు. అయితే.. రిటర్నింగ్ ఆఫీసర్​ సోమవారం జోగిందర్​ నామినేషన్​ను తిరస్కరించారు. దీంతో జిల్లాలోని కలెక్టర్​ ఆఫీస్​ ముందు జోగిందర్​ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

AAP candidate Joginder Singh
ధర్నాకు దిగిన జోగిందర్ సింగ్

అనంతరం జోగిందర్.. కలెక్టర్​ ఆఫీస్​ ముందే ధర్నాకు దిగారు. నామినేషన్​ పత్రంలో ఏదైనా పొరపాటు జరిగితే.. అది సరిచేసుకునేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సిక్కు అయినందువల్లే తన నామినేషన్​ను తిరస్కరించారంటూ అధికారులపై సంచలను ఆరోపణలు చేశారు.

Joginder Singh
కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:

UP assembly elections : 159 మంది అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.