ETV Bharat / bharat

KGBV Recruitment : కస్తూర్బా స్కూల్​ టీచర్​ పోస్ట్​లకు నోటిఫికేషన్​​.. అప్లై చేసుకోండిలా!

author img

By

Published : Jun 19, 2023, 11:35 AM IST

KGBV Recruitment 2023
KGBV Recruitment 2023 for teacher posts

KGBV Recruitment 2023 : ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునే మహిళా అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. తెలంగాణ కమిషనర్​ అండ్​ డైరెక్టరేట్​ ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్ 1241​ కాంట్రాక్ట్​ మహిళా అధ్యాపకుల నియామకం కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో, అర్బన్​ రెసిడెన్షియల్​ స్కూల్స్​లో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..

KGBV Recruitment 2023 : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాయలాల్లో, అర్బన్​ రెసిడెన్సియల్​ స్కూల్స్​లో 1241 కాంట్రాక్ట్​ మహిళా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
కేజీబీవీ పాఠశాలల్లో అధ్యాపకులుగా పనిచేయడానికి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్బన్​ రెసిడెన్సియల్​ పోస్టులకు మహిళలతో పాటు పురుషులు కూడా అర్హులే. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్​ 26 నుంచి జులై 5వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. జులై నెలలోనే ఆన్​లైన్​ విధానంలో రాత పరీక్ష కూడా నిర్వహించనున్నారు.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని పోస్టుల వివరాలు

  • స్పెషల్​ ఆఫీసర్​ - 38
  • పీజీసీఆర్​టీ (ఆంగ్లం) - 110
  • పీజీసీఆర్​టీ (గణితం) -60
  • పీజీసీఆర్​టీ (నర్సింగ్​) - 160
  • పీజీసీఆర్​టీ (తెలుగు) - 104
  • పీజీసీఆర్​టీ (ఉర్దూ) - 2
  • పీజీసీఆర్​టీ (వృక్షశాస్త్రం) - 55
  • పీజీసీఆర్​టీ (కెమిస్ట్రీ) - 69
  • పీజీసీఆర్​టీ (జంతుశాస్త్రం) - 54
  • సీఆర్​టీ (బయో సైన్స్​) - 25
  • సీఆర్​టీ (ఆంగ్లం) - 52
  • సీఆర్​టీ (హిందీ) - 37
  • సీఆర్​టీ (గణితం) -45
  • సీఆర్​టీ (ఫిజికల్​ సైన్స్​) - 42
  • సీఆర్​టీ (సోషల్​ స్టడీస్​) - 26
  • సీఆర్​టీ (తెలుగు) - 27
  • ఫిజికల్​ ఎడ్యుకేషన్​ టీచర్​ - 77

నోట్​: ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అర్బన్​ రెసిడెన్సియల్​ స్కూల్స్​ (యూఆర్ఎస్​)లోని పోస్టుల వివరాలు

  • స్పెషల్​ ఆఫీసర్​ - 4
  • సీఆర్​టీ (తెలుగు) - 5
  • సీఆర్​టీ (ఆంగ్లం) - 5
  • సీఆర్​టీ (సైన్స్​) - 6
  • సీఆర్​టీ (సోషల్​ స్టడీస్​) - 3

నోట్​ : ఈ పోస్టులకు మహిళలతో పాటు పురుషులు కూడా అర్హులే.

  • విద్యార్హతలు
    అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఈడీ/ స్పెషల్​ బీఈడీ/ యూజీపీఈడీ/ బీపీఎడ్​ ఉత్తీర్ణతతో సహా టెట్​/ సీటెట్​లోనూ అర్హత సాధించి ఉండాలి.
  • వయోపరిమితి
    2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో అభ్యర్థుల వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఇచ్చారు.​
  • ఫీజు వివరాలు
    అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.600లు చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం

  • స్పెషల్​ ఆఫీసర్​ : రాత పరీక్షకు 75 శాతం వెయిటేజీ, టెట్​కు 20 శాతం వెయిటేజీ, పని అనుభవానికి 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • పీజీజీఆర్​టీ పోస్టులు: రాత పరీక్షకు 95 శాతం వెయిటేజీ, పని అనుభవానికి 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • సీఆర్​టీ పోస్టులు : రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ, టెట్​కు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
  • పీఈటీ పోస్టులు : కేవలం రాతపరీక్షలో మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.