ETV Bharat / bharat

ప్యాసింజర్​ రైలులో అగ్నిప్రమాదం- చెలరేగిన మంటలు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 2:53 PM IST

Updated : Dec 26, 2023, 4:11 PM IST

train accident maharashtra today
train accident maharashtra today

Train Fire Maharashtra : మహారాష్ట్రలో పుర్ణ-పర్లి ప్యాసింజర్​ ప్యాసింజర్​ రైలులో మంటలు చెలరేగాయి. నాందేడ్​లోని మెయింటేనెన్స్​ యార్డ్​లో నిలిపి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

ప్యాసింజర్​ రైలులో అగ్నిప్రమాదం

Train Fire Maharashtra : మహారాష్ట్ర నాందేడ్​లో పుర్ణ-పర్లి ప్యాసింజర్​ ప్యాసింజర్​ రైలులో మంటలు చెలరేగాయి. మెయింటెనెన్స్​ యార్డ్​లో నిలిపి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైలులో మంటలు చెలరేగడం వల్ల సమీపంలోని రైల్వే స్టేషన్​లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఇదీ జరిగింది
నాందేడ్​లోని హూజుర్​ సాహెబ్ రైల్వే స్టేషన్​ సమీపంలో ఉదయం 9.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మెయింటెనెన్స్​ యార్డ్​లో నిలిపి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైల్వే శాఖతో పాటు స్థానిక మున్సిపల్​ కార్పొరేషన్​కు సంబంధించిన అగ్రిమాపక సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖాళీగా ఉన్న లగేజీ వ్యాన్​ కోచ్​లో మంటలు చెలరేగగా, 30 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకువచ్చినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఒక్క బోగీ మాత్రమే అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. మంటలు వ్యాపించకుండా బోగిని మరో ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.

ఒకదానితో ఒకటి ఢీ కొని ఆరు వాహనాలు దగ్ధం- ముగ్గురు సజీవ దహనం
Madhya Pradesh Road Accident : మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనాల పైకి దూసుకెళ్లింది. ఫలితంగా ఒకదానితో ఒకటి ఢీకొని వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్రక్కుతోపాటు మరో ఐదు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ముగ్గురు సజీవ దహనమయ్యారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం
ధార్‌ జిల్లాలోని ఆగ్రా-ముంబయి జాతీయ రహదారిపై ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిలై అదుపు తప్పింది. దీంతో ముందున్న ఐదు వాహనాలపైకి దూసుకెళ్లింది. వెంటనే మంటలు వ్యాపించడం వల్ల ఆరు వాహనాలు కాలి బుడిదయ్యాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Agra Train Accident : రైలులో ఒక్కసారిగా మంటలు.. రెండు బోగీలు దగ్ధం

రైలులో భారీ అగ్నిప్రమాదం- ప్రయాణికులు సేఫ్​!

Last Updated :Dec 26, 2023, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.