ETV Bharat / bharat

సంప్రదాయ ఉద్యోగాలు వద్దా? ఈ టాప్​ 10 రిమోట్​ జాబ్స్​పై ఓ లుక్కేయండి

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 11:33 AM IST

Top 10 Remote Jobs For Everyone In Telugu : మీకు సంప్రదాయ ఉద్యోగాలు అంటే ఇష్టం లేదా? ఫ్రీలాన్సర్​గా పనిచేయాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న రిమోట్ జాబ్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 10 Remote Jobs For Everyone
Best Remote Jobs to Consider in 2023

Top 10 Remote Jobs For Everyone : టెక్నాలజీ అందుబాటులో వచ్చిన తరువాత ఉద్యోగాల స్వరూపాలు చాలా మారిపోయాయి. ఒకప్పటిలా కచ్చితంగా ఆఫీస్​కు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే జాబ్​ చేయవచ్చు. ఆ మాటకొస్తే, ఎక్కడి నుంచైనా ఉద్యోగం చేయచ్చు.

నేటి యువత సంప్రదాయబద్ధమైన ఉద్యోగాల కంటే.. ఫ్రీలాన్సింగ్​కు ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. తమ మనస్సుకు నచ్చిన ఉద్యోగాలను, తమకు నచ్చిన సమయంలో చేయడానికే యువతీయువకులు మొగ్గు చూపిస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగాన్ని సమతుల్యం చేసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో కొన్ని ముఖ్యమైన రిమోట్ జాబ్స్ గురించి తెలుసుకుందాం.

  1. వర్చువల్ అసిస్టెంట్​ ఉద్యోగాలు
    Virtual Assistant Jobs : నేటి కాలంలో వర్చువల్ అసిస్టెంట్​లకు మంచి డిమాండ్ ఉంది. మీ దగ్గర కేవలం ఒక కంప్యూటర్​, ఇంటర్నెట్ కనెక్షన్​, మంచి కమ్యునికేషన్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ స్కిల్స్​ ఉంటే చాలు వర్చువల్ అసిస్టెంట్​గా పనిచేయవచ్చు. వర్చువల్ అసిస్టెంట్​లు.. సంస్థకు సంబంధించిన ఈ-మెయిల్స్ నిర్వహిస్తారు. అపాయింట్​మెంట్​లను షెడ్యూల్ చేస్తారు. బుక్​కీపింగ్​తోపాటు కస్టమర్​ సపోర్ట్ ఇవ్వడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆఫీస్​కు వెళ్లకుండానే.. మీకు నచ్చిన ప్రదేశంలో ఉంటూ సింపుల్​గా ఈ పనులు చేయవచ్చు.
  2. కంటెంట్ క్రియేటర్స్​
    Content Creator Jobs : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత కంటెంట్ క్రియేటర్లకు అవకాశాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా కంటెంట్​ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్​, వీడియో ప్రొడక్షన్​, ఫొటోగ్రఫీల్లో మంచి టాలెంట్ ఉంటే చాలు. బోలెడు ఆపర్చూనిటీస్​ అందుబాటులో ఉన్నాయి. నేడు చాలా మంది కంటెంట్ క్రియేటర్లు ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్నారు. లేకుంటే స్వయంగా బ్లాగ్స్​ రూసుకుంటున్నారు. మరికొందరు యూట్యూబర్స్​గా, గ్రాఫిక్ డిజైనర్లుగా రాణిస్తున్నారు.
  3. సాఫ్ట్​వేర్ డెవలపర్స్​
    Software Developer Jobs : నేటి కాలంలో సాఫ్ట్​వేర్ డెవలపర్స్​కు లెక్కలేనన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. టెక్​ కంపెనీలు మంచి టాలెంట్ ఉన్న వెబ్​ డెవలపర్స్​, యాప్​ డెవలపర్స్​, ప్రోగ్రామర్స్​కు భారీ జీతాలు ఇస్తున్నాయి. ఈ సాఫ్ట్​వేర్ డెవలపర్స్​ ఆఫీసులకు వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉండదు. మరి కొందరు సాఫ్ట్​వేర్​ డెవలపర్స్.. ఓపెన్ సోర్స్​ ప్రాజెక్టులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మరికొందరు ఫ్రీలాన్సర్స్​గా పనిచేస్తూ.. తమకు నచ్చిన పనిని, నచ్చిన సమయంలో చేస్తూ ఉంటారు.
  4. ఆన్​లైన్ టీచింగ్​/ ట్యూటరింగ్
    Online Teaching Jobs : సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నవారు ఆన్​లైన్ టీచింగ్ చేస్తూ లేదా ట్యూషన్​లు చెబుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వాస్తవానికి కరోనా సంక్షోభం తరువాత ఈ ఆన్​లైన్​ టీచింగ్​కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. నేడు ఆన్​లైన్​ టీచింగ్​ చేయడానికి అనేక వెబ్​సైట్స్​, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా వీటిని ట్రై చేయవచ్చు.
  5. కస్టమర్ సర్వీస్​ రిప్రజెంటేటివ్స్​
    Customer Service Representatives : నేడు చాలా కంపెనీలు తమ కస్టమర్లకు సర్వీస్ అందించడం కోసం కస్టమర్​ సర్వీస్​ రిప్రజెంటేటివ్స్​ను నియమించుకుంటున్నాయి. వీరు ఇంట్లోనే ఉంటూ.. సదరు కంపెనీ కస్టమర్లకు ఈ-మెయిల్​, చాట్​ లేదా ఫోన్​ ద్వారా సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కస్టమర్లకు వచ్చే సందేహాలను తీర్చడం, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం, తగిన సమాచారం ఇవ్వడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. మీ దగ్గర కంప్యూటర్​/ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేచాలు. మంచి కమ్యునికేషన్​ స్కిల్స్​ ఉన్నవారు.. కస్టమర్ సర్వీస్​ రిప్రజెంటేటివ్​గా రాణించే అవకాశం ఉంటుంది.
  6. ఈ-కామర్స్​ అండ్​ డ్రాప్​షిప్పింగ్
    E Commerce and Drop shipping Jobs : మీరు స్వయంగా అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ లాంటి ఫ్లాట్​ఫామ్స్​లో లేదా మీ సొంత వెబ్​సైట్​లో వస్తువులను అమ్మవచ్చు. లేదా డోర్​షిప్పింగ్ సేవలు అందించవచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ బిజినెస్ బాగా రన్ అవుతోంది. అయితే దీనికి మొదట కొద్ది మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీరు స్వయం ఉపాధి పొందాలంటే ఈ-కామర్స్, డోర్ షిప్పింగ్ లాంటివి చాలా బాగుంటాయి.
  7. సోషల్​ మీడియా ఇన్​ప్లూయెన్సర్స్
    Social Media Influencers : నేడు సోషల్ మీడియా మానియా కొనసాగుతోంది. అందుకే చాలా మంది యూట్యూబర్లుగా రాణిస్తున్నారు. మరికొందరు ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. ముఖ్యంగా వీరు సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లుగా రాణిస్తూ.. వేలల్లో, లక్షల్లో.. మరికొందరు కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు.
  8. సోషల్ మీడియా మేనేజ్​మెంట్​ :
    Social Media Management Jobs : సోషల్ మీడియా మేనజర్లకు నేడు విపరీతమైన డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద ఇన్​ప్లూయెన్సర్లు.. కంటెంట్ క్రియేషన్​, కంటెంట్​ మేనేజింగ్ కోసం.. సోషల్ మీడియా మేనేజర్లపై ఆధారపడుతున్నారు. మీకు కనుక సోషల్ మీడియా మీద మంచి అవగాహన ఉండే.. ఈ జాబ్స్​ను ట్రై చేయవచ్చు.
  9. డేటా ఎంట్రీ
    Data Entry Jobs : చాలా మంది డేటా ఎంట్రీ జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఫ్రీలాన్సింగ్ వెబ్​సైట్లలో ఈ జాబ్స్ అందుబాటులో ఉంటాయి. డేటా ఎంట్రీ జాబ్స్​కు పెద్దగా స్కిల్స్​, ఎక్స్​పీరియన్స్ అవసరం ఉండదు. అందుకే వీటికి పేమెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డేటా ఎంట్రీ జాబ్స్ విషయంలో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఉందుకే అప్రమత్తంగా ఉండాలి.​ ఏఐ వచ్చిన తరువాత ఈ డేటా ఎంట్రీ జాబ్స్ భవిష్యత్​ అంత ఆశాజనకంగా లేదు. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గుర్తించుకోండి.
  10. సేల్స్ అండ్ మార్కెటింగ్​
    Sales and Marketing Jobs : ఎవరుపడితే వాళ్లు సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయలేరు. దానికి ప్రత్యేకమైన స్కిల్​ కావాల్సి ఉంటుంది. మీకు గనుక డిజిటల్ మార్కెటింగ్, SEO, బిజినెస్ స్కిల్స్ ఉంటే.. ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు చాలానే ఉన్నాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్లు.. వివిధ కంపెనీలకు చెందిన వస్తు, సేవలను ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.

నోట్​ : రిమోట్ జాబ్స్ చేయాలని అనుకునేవారు.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలను అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమల, కంపెనీల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. లేకుంటే భవిష్యత్​లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. ఆల్​ ది బెస్ట్​!

Best Job Tips For Freshers : తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే జాబ్ గ్యారెంటీ!

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.