ETV Bharat / bharat

Telugu People With Ramoji Rao: 'తెలుగువారంతా రామోజీగారితోనే'... ట్విట్టర్​లో టాప్ ట్రెండింగ్.. ప్రభుత్వ వేధింపులపై ఆగ్రహం

author img

By

Published : Aug 21, 2023, 1:26 PM IST

Updated : Aug 21, 2023, 5:26 PM IST

Telugu People With Ramoji Rao
Telugu People With Ramoji Rao

Telugu People With Ramoji Rao: 'మార్గదర్శితో మేమున్నాం'... అంటూ తెలుగు ప్రజలు ముక్తకంఠంతో ప్రకటిస్తున్నారు. మార్గదర్శి సంస్థపై ప్రభుత్వ దాడులను ట్విటర్(X) వేదికగా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ఈనాడుపై కక్షతో మార్గదర్శిని టార్గెట్ చేశారని మండిపడుతున్నారు. విలువలకు పెద్దపీట వేసే మార్గదర్శి యాజమాన్యం నేపథ్యాన్ని గుర్తుచేస్తూ.. ట్విటర్ వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu People With Ramoji Rao: ఈనాడుపై కక్షతో.. మార్గదర్శి సంస్థపై ప్రభుత్వం చేస్తున్న దాడులపై నెటిజన్లు మండిపడుతున్నారు. లక్షలాది చందాదారుల నమ్మకాన్ని పొందిన మార్గదర్శి పై దుష్ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. మార్గదర్శికి మద్దతుగా రాజకీయాలకు అతీతంగా సామాన్య ప్రజలు సైతం ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో #TeluguPeopleWithRamojiRao హాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. సోమవారం మధ్యాహ్నానికి దాదాపు 43వేలకుపైగా ట్వీట్లు నమోదు కావడం గమనార్హం. అందులో కొన్ని..

  • మార్గదర్శి సంస్థ అక్రమాలకుపాల్పడి, డిపాజిటర్లను మోసగిస్తే, దానికి సంబంధించిన ఆధారాలను ఉండవల్లి, జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఎందుకు ఉంచడంలేదు? #TeluguPeopleWithRamojiRao pic.twitter.com/XpyD4qb6MF

    — Telugu Desam Party (@JaiTDP) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చిట్ ఫండ్ చట్టాలను ఉల్లంఘించి, హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి, నిబంధనలన్నీ బేఖాతరు చేసి మార్గదర్శిపై దాడులు చేయిస్తూ లక్షలాది చందాదారులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వానికి తగనిపని.. ఇది పాలకులు చేయాల్సిన పనికాదు".

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇప్పటికే అనేకమంది పారిశ్రామికవేత్తలను బెదిరించి తరిమేశారు... భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు.. రాష్ట్ర ప్రజలంతా ఏకమై జగన్మోహన్​ రెడ్డి కిరాతక పాలనను అంతం చేయడం తథ్యం"

"రామోజీరావు తన క్రమశిక్షణ, కృషి, శ్రేష్ఠత సాధనతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన రైతు బిడ్డ.. ఈనాడు తన పని తాను చేసుకుపోతున్నందున రామోజీ రావును వేధించడాన్ని పౌర సమాజం ఖండించాలి."

  • పారిశ్రామికవేత్తల పై జగన్ రెడ్డి వేధింపులు పరాకాష్టకు చేరాయి.
    దశాబ్దాలుగా ఉన్న అమర్ రాజా, మార్గదర్శి లాంటి సంస్థల పై కూడా జగన్ రెడ్డి, తన కక్షసాధింపు ధోరణి ప్రదర్శించటం సిగ్గు చేటు.#TeluguPeopleWithRamojiRao pic.twitter.com/jeGXsTg7s5

    — Telugu Desam Party (@JaiTDP) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆరు దశాబ్దాల ప్రస్థానంలో రామోజీ రావుపై లేని అవినీతి ఆరోపణలు... వైసీపీ అధికారంలోకి వచ్చా కే ఎందుకు వస్తున్నాయో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇది కక్షసాధింపు!"

జర్నలిజం, సాహిత్యం, విద్యలో రామోజీరావు చేసిన సేవలకు భారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ లభించింది.. అంతటి మహావ్యక్తి లక్ష్యంగా వైసీపీ కుట్రపూరిత దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

- టీడీపీ నేత చంద్రబాబు

మంచికే అంతిమ విజయం..: చంద్రబాబు సొంత వైఫల్యాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్..., ఆ మానసిక ఆందోళనను అరవై ఏళ్లుగా తెలుగు ప్రజలకు సేవ చేస్తున్న మార్గదర్శిని వేధించేందుకు లక్ష్యంగా చేసుకున్నాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంస్థలను నిర్వీర్యం చేసే సైకో చర్యలను కొనసాగిస్తున్న జగన్ రెడ్డి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా (Meedia) ను కూల్చాలని కుట్ర పన్నుతున్నాడంటూ ఆయన మండిపడ్డారు. వైసీపీ మోసాలు, నీచాలు ఎండగడుతున్న ఈనాడుని ఓ నియంతలా వేధించి భయపెట్టాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. తనకు భజన చేసే మీడియాకు మాత్రం అమితప్రాధాన్యం ఇస్తున్నాడని విమర్శించారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో రామోజీరావు చేసిన సేవలకు భారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ లభించిందని గుర్తుచేశారు. అంతటి మహావ్యక్తి లక్ష్యంగా వైసీపీ కుట్రపూరిత దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. జగన్ చేసిన దుష్ట ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇక ముఖం చాటేశాడని ఎద్దేవా చేశారు. చెడు ఎప్పుడూ ఓడిపోతుందనీ.. మంచిదే ఎప్పటికైనా అంతిమ విజయం అని ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. తెలుగు ప్రజలు అంతా రామోజీరావు (Ramoji Rao)తోనే ఉన్నారని గుర్తుంచుకోవాలని చంద్రబాబు స్పష్టంచేశారు.

  • Continuing his tendency to dismantle institutions, YS Jagan is now trying to raze down media - the fourth pillar of democracy. Like a dictator, he favors media that praises him and harasses and intimidates media like Eenadu that exposes YSRCP’s scams and dirty deeds. Driven by… pic.twitter.com/XfPOA2dnr2

    — N Chandrababu Naidu (@ncbn) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • జగన్ రెడ్డి షెల్ కంపెనీల మాదిరి మార్గదర్శి రాత్రికి రాత్రి పుట్టోకొచ్చిన సంస్థ కాదు. 6 దశాబ్దాలకుపైగా ప్రజల విశ్వాసం పొందిన సంస్థ#TeluguPeopleWithRamojiRao pic.twitter.com/cOPV7j3eQk

    — Anitha Vangalapudi (@Anitha_TDP) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • చిట్ ఫండ్ చట్టాలను ఉల్లంఘించి, హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి, నిబంధనలన్నీ బేఖాతరు చేసి ఏడెనిమిది శాఖలతో మార్గదర్శిపై దాడులు చేయిస్తూ వేలాది ఉద్యోగులు, లక్షలాది చందాదారులను భయభ్రాంతులకు గురిచెయ్యడం ప్రభుత్వానికి తగనిపని, పాలకులు చేయాల్సింది కాదు.. #TeluguPeopleWithRamojiRao pic.twitter.com/cDhLWK1U4c

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP CID Chief Sanjay on Margadarsi: మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని మేమే చెబుతున్నాం: సీఐడీ చీఫ్ సంజయ్

ప్రజాస్వామ్యానికే ముప్పు..: నారా లోకేశ్ మార్గదర్శిపై ప్రభుత్వం చేస్తున్న దాడులు ప్రజాస్వామ్యానికే ముప్పు అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ (Nara Loksh) పేర్కొన్నారు. పాలకుల అవినీతి, అసమర్ధతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టి.. ఆ పగను మార్గదర్శి సంస్థలపై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. తన చేతిలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ తన పగ తీర్చుకోవడం కోసం జగన్ వాడుకోవడం చూస్తే... ఆ సైకో (Psycho Jagan) చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోందని మండిపడ్డారు. ఇదంతా చేస్తున్నది ప్రజల శ్రేయస్సు కోసమే అనుకుంటే పోలవరం కట్టడం, రాజధాని అమరావతి (Amaravati)ని నిర్మించాలని హితవు పలికారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేతల పై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్‌ చేశారు. అంతే కానీ, ప్రజలను చైతన్యవంతం చేస్తున్న మీడియా అధిపతులను వేధించవద్దని హితవుపలికారు.

AP CID Fourth Day Raids in Margadarsi Branches: కొనసాగుతున్న కక్ష సాధింపు.. నాలుగో రోజు మార్గదర్శి బ్రాంచ్​ల్లో సోదాలు

ఆటవిక దృక్పథం..: నల్లమిల్లి మార్గదర్శిపై ప్రభుత్వ దాడి జగన్‌ రెడ్డి కక్షసాధింపు దుర్మార్గపు చర్యగా టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎందరో రెడ్డి రాజులు గతంలో రాష్ట్రాన్ని పాలించారు గానీ.. జగన్‌రెడ్డిలా ఏ ఒక్కరూ కొన్ని కులాలను అణగదొక్కలేదని పేర్కొన్నారు. రెడ్డి కులస్తులకు నలుగురికి మంచిచేసే దృక్పథం ఉంటుందన్న నల్లమిల్లి.. రెడ్డిలకు చెడ్డపేరు తెచ్చేలా జగన్‌ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. సీమ పాలెగాళ్ల సంస్కృతిని జగన్‌ అమలు చేస్తున్నారని, ఆర్థికంగా దెబ్బతీసి తమ కాళ్ల దగ్గర ఉంచుకోవాలన్నదే జగన్‌ యత్నం అని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ఆటవిక దృక్పథం జగన్‌ది.. మార్గదర్శి (Margadarshi) పై దాడుల కోసం అన్ని శాఖల అధికారులకు శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. అధికారులకు సజ్జలతో శిక్షణ ఇప్పించటం పాలెగాళ్ల సంస్కృతికి తార్కాణం అని పేర్కొన్నారు. అగ్నిమాపక నిబంధనల సాకుతో మార్గదర్శి ఆఫీసుల సీజ్‌కు జగన్‌ కుట్ర చేశారన్న నల్లమిల్లి.. తాడేపల్లి ప్యాలెస్‌కు జగన్‌ ఏ నిబంధనలు పాటించాడు? అని సూటిగా ప్రశ్నించారు. జగన్‌ ప్యాలెస్‌లకు లేని నిబంధనలు మార్గదర్శికే ఉంటాయా? అని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన లోటస్‌పాండ్‌ ప్యాలెస్‌పై జగన్ సమాధానం ఏమిటని నిలదీశారు. మార్గదర్శిపై కక్ష కట్టిన జగన్.. అగ్రిగోల్డ్ బాధితులకు ఏం చెబుతారు?.. అగ్రిగోల్డ్(Agrigold) బాధితులకిచ్చిన మాట తప్పిన జగన్‌పై సీఐడీ 420 కేసు ఎందుకు పెట్టట్లేదు అని అన్నారు.

YSRCP Government Actions on Margadarsi న్యాయానికి చెల్లుచీటీ.. ‘ఈనాడు’ గొంతు నొక్కటమే అసలు ఎజెండా

రామోజీరావుకు యావత్ తెలుగు జాతి మద్దతు..: ధూళిపాళ్ల పద్మవిభూషణ్ రామోజీ రావు తెలుగు ప్రజల ఆస్తి.. ఆయన స్థాపించిన సంస్థలు మనకు కీర్తి అని తెలుగుదేశం సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర కొనియాడారు. పాలకులంటే ప్రజల ప్రగతి పై దృష్టిపెట్టాలి కానీ... పగ సాధించడంపై కాదని ముఖ్యమంత్రి జగన్‌ కు హితవు పలికారు. ప్రభుత్వ అసమర్థతను, అధికార పార్టీ అకృత్యాలను ప్రజల దృష్టికి తెస్తున్న మీడియాపై కక్షపూరిత చర్యలు జగన్ రాక్షసత్వాన్ని చూపిస్తున్నాయి తప్ప.. మీడియాను భయపెట్టలేవని స్పష్టం చేశారు. ఈనాడు మీద పగబట్టి... ఆ పగను మార్గదర్శి సంస్థల పై తీర్చుకుంటున్న సీఎం జగన్ శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారని ధ్వజమెత్తారు. 6 దశాబ్దాల మార్గదర్శిపై నేడు మీరు ఉమ్మివేస్తే అది మీపైనే పడుతుందని దుయ్యబట్టారు. కుట్రలు కుతంత్రాలతో మార్గదర్శిపై చిన్న మరక కూడా వేయలేరని స్పష్టం చేశారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా... ఎన్ని కేసులు పెట్టినా ప్రజలకు ఆ సంస్థల పై ఉన్న నమ్మకాన్ని చెరిపేయలేరని తేల్చిచెప్పారు. ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయింది జగన్, ఆయన ప్రభుత్వం తప్ప.... తెలుగు ప్రజలు గర్వంగా భావించే ఈనాడు, మార్గదర్శి సంస్థలు కావని స్పష్టం చేశారు. రామోజీ రావు కి యావత్ తెలుగు జాతి మద్దతుగా నిలుస్తుందన్నారు.

ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి.. తెలుగుప్రజలు రామోజీరావుకు తెలుపుతున్న మద్దతు చూసైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలని విశ్లేషకులు హితవుపలుకుతున్నారు. విశ్వసనీయతకు విశ్వరూపం రామోజీరావంటూ కొందరు కొనియాడితే..., తెలుగువారి ఆత్మగౌరవ పతాక అంటూ తమ అభిప్రాయం వెలిబుచ్చారు. పదవులు ఆశించకుండా, సన్మానాలు స్వీకరించకుండా తెలుగు వారి ప్రయోజనాలకే జీవితాంతం కృషి చేసిన రామోజీరావును ఓ రుషిగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. జగన్‌ ఎంత కక్షసాధింపులకు పాల్పడుతున్నా ఏ ఒక్కరిలోనూ మార్గదర్శిపై నమ్మకం సడలటం లేదని తేల్చిచెబుతున్నారు.

Last Updated :Aug 21, 2023, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.