ETV Bharat / state

YSRCP Government Actions on Margadarsi న్యాయానికి చెల్లుచీటీ.. ‘ఈనాడు’ గొంతు నొక్కటమే అసలు ఎజెండా

author img

By

Published : Aug 20, 2023, 6:56 AM IST

YCP Government Actions on Margadarsi Against Court Orders: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల ఆదేశాలను ధిక్కరిస్తూ రామోజీ గ్రూపు సంస్థలపై వైసీపీ ప్రభుత్వం.. కక్షసాధింపు చర్యలకు తెగబడుతోంది. 'ఈనాడు' గొంతు నొక్కడమే లక్ష్యంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వివిధ ప్రభుత్వ శాఖలను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పైకి ఉసిగొల్పింది. 37 బ్రాంచుల్లో ఈనెల 17 నుంచి 3 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో రాత్రింబవళ్లూ సోదాలు చేయిస్తూ.. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారాన్ని దెబ్బతీయాలన్న కుట్రతో వ్యవహరిస్తోంది.

YCP_Government_Actions_on_Margadarsi
YCP_Government_Actions_on_Margadarsi

YCP Government Actions on Margadarsi Against Court Orders: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ గ్రూపులు నిలిపివేతకు.. వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ హైకోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి తెగబడుతోందనడానికి(Raids in Margadarsi Branches) మూడు రోజులుగా జరుగుతున్న చర్యలే నిదర్శనం. ఎలాగైనా సరే మార్గదర్శిని మూయించాలన్న దురుద్దేశంతో క్రూరమైన చర్యలకు పాల్పడుతోంది. మార్గదర్శి ఉద్యోగులు, సిబ్బందితో పాటు చందాదరులను బెదిరిస్తోంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, చిట్ ఫండ్ చట్టంలోని అంశాలకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతోంది.

AP CID Officers Attend to Telangana High Court: మార్గదర్శి కేసు.. ఏపీ సీఐడీ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం

స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ తరపున రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ తదితరులను పంపించి తనిఖీలు చేయిస్తోంది. తాము ఎలాంటి దర్యాప్తు చేయట్లేదని చెబుతూనే ఏపీ సీఐడీ బృందాలు వారికి సహకరిస్తున్నాయి. రెవెన్యూ ఇంటెలి జెన్స్, అగ్నిమాపక, పురపాలక - పట్టణాభివృద్ధి, కార్మిక శాఖల అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సూచనలతో సీఐడీ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలకు వెళ్లి ఖాతాదారులపై ఒత్తిడి తెచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు.

Second Day Raids in Margadarsi మార్గదర్శిపై రెండోరోజు కొనసాగిన కక్షసాధింపు పర్వం..!

YCP Neglecting Court Orders in Margadarsi Case: తరతరాలుగా మార్గదర్శిపై చందాదారుల్లో ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని దెబ్బతీయాలన్న ఎజెండాతోనే.. గత పది నెలలుగా జగన్ ప్రభుత్వం నిరాధార, ఊహాజనిత, కల్పిత, తర్కంలేని ఆరోపణలతో బురద చల్లుతోంది. 1962లో రామోజీరావు స్థాపించిన మార్గదర్శి చిట్ ఫండ్ ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు. విశ్వసనీయతకు, సమగ్రతకు ప్రతీక. మధ్య తరగతి వర్గాల ఆర్థిక అవసరాలను తీర్చే ప్రత్యామ్నాయ వ్యవస్థగా సేవలందిస్తోంది. ఈనాడు, ఈటీవీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీలతో కూడిన రామోజీ గ్రూపు కంపెనీల్లో మార్గదర్శి సంస్థ తలమానికంగా ఉంది.

Attacks on Margadarsi Offices: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు

What is Chit Fund Act: చిట్ ఫండ్ చట్టం-1982లోని నిబంధనల ప్రకారం చిట్ రిజిస్ట్రార్లకు పరిమితమైన అధికారాలే ఉన్నాయి. వారు కేవలం రికార్డుల తనిఖీలకే పరిమితం కావాలి. ఏదైనా చిట్ ఫండ్ సంస్థ నుంచి స్పష్టత కావాలనుకుంటే సంబంధిత సమాచారాన్ని ఆ సంస్థను అడిగి తెలుసుకోవచ్చు. చిట్ రిజిస్ట్రార్లకు చట్టం పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. సొమ్ములు చెల్లించటంలో విఫలమైందంటూ ఇన్నేళ్లుగా ఏ ఒక్క చందాదారు ఫిర్యాదు చేయకపోయినా అధికార ఒత్తిళ్లకు తలొగ్గి మార్గదర్శిని వేధించటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార కేంద్రాల్లోని వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ శాఖలను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే వేధింపుల ప్రక్రియలో భాగస్వాములవుతున్న అధికారులే.. చట్టపరంగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తీసుకోబోయే చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

AP CID Second Day Raids at Margadarsi Branches: ఆగని కక్షసాధింపు.. మార్గదర్శి బ్రాంచీల్లో రెండో రోజూ ఏపీ సీఐడీ తనిఖీలు

నిధుల కొరతతో ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శిని మూసేస్తున్నారంటూ పచ్చి అబద్ధాలతో ప్రభుత్వం నిరంతరాయంగా దుష్ప్రచారం చేస్తోంది. 6 దశాబ్దాలుగా విశ్వసనీయతకు మారు పేరుగా ఉన్న సంస్థపై అసత్య ఆరోపణలు చేస్తోంది. చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్ 46ను ఉల్లంఘించి నిరంతరాయంగా మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీలు కొనసాగిస్తోంది. అనధికారిక వ్యక్తులను పంపించి ఈ తనిఖీలు చేయిస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖాధికారులతో పాటు తనిఖీలకు వస్తున్న వ్యక్తుల వివరాలివ్వాలని మార్గదర్శి సిబ్బంది అడుగుతున్నా పట్టించుకోవట్లేదు.

AP CID Raids in Margadarsi Branches కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు.. మూసివేత లక్ష్యంగా చర్యలు..

Jagan Government Targeting Margadarsi: చిట్ రిజిస్ట్రార్లు చేపట్టే తనిఖీ ప్రక్రియల్లో CID, పోలీసులకు ఎలాంటి పాత్ర ఉండదు. సంబంధిత శాఖల నుంచి తగిన అనుమతి లేకుండా వారు పాల్గొనటానికి వీల్లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు, సిబ్బంది.. సీఐడీ సహకారంతో మార్గదర్శి ఉద్యోగులు, సిబ్బందిని రాత్రంతా కార్యాలయాల్లోనే నిర్బంధిస్తున్నారు. కనీస వైద్య అవసరాల కోసం బయటకు పంపించట్లేదు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. ఇది చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్ 46 ఉల్లంఘనే.

చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ తనిఖీ అధికారులు.. పలుచోట్ల మినిట్స్ ఒరిజినల్ పత్రాలు తీసుకెళ్లిపోతున్నారు. ఇది చట్టవిరుద్ధం. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తనిఖీలు ప్రారంభించిన తొలి రోజు.. రెండు బ్రాంచిల్లో షట్టర్లు మూసేసి మరీ సోదాలు నిర్వహించారు. పలుచోట్ల చందాదారులను మార్గదర్శి బ్రాంచిల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటూ బెదిరిస్తున్నారు. చిట్టీ పాడుకుని ఇంకా డబ్బులు తీసుకోని చందాదారులను మార్గదర్శి బ్రాంచ్లకు పిలిపిస్తూ సంస్థకు వ్యతిరేకంగా ఫిర్యాదులివ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.

Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ

గతంలో చిట్టీ పాడుకుని సొమ్ము తీసుకున్న చందాదారులతో మార్గదర్శిపై ఎలాగైనా ఫిర్యాదులు చేయించడానికి విఫలయత్నాలు చేస్తున్నారు. చందాదారుల గురించి ఆరా తీయటానికి అంటూ మార్గదర్శి ఏజెంట్లను పిలిపిస్తున్న సీఐడీ అధికారులు.. సంస్థపై ఫిర్యాదులివ్వాలని వారిని ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఏదో ఒక సాకు చూపి.. ఉద్యోగులపై తప్పుడు కేసులు పెట్టాలన్న లక్ష్యంతో సోదాలు కొనసాగిస్తున్నారు.

Margadarshi: ఈనాడుపై కక్షతోనే మార్గదర్శి సంస్థపై సీఐడీ ఏఫ్​ఐఆర్​లు​

Margadarsi Case Updates: మార్గదర్శి రోజువారీ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం.. రోజుకో ఎజెండాతో పని చేస్తోంది. డాక్యుమెంట్ల తనిఖీ పేరిట.. మేనేజర్లు, సిబ్బందిపై తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తోంది. రాత్రి, పగలూ మార్గదర్శి మేనేజర్లను బ్రాంచిల్లోనే నిర్బంధిస్తోంది. ఏపీలోని 37 బ్రాంచిల్లోనూ కొత్తగా కేసులు నమోదు చేసేందుకు యత్నిస్తోంది. ఒరిజినల్ రికార్డులు సీజ్ చేసి, వాటి ఎక్నాలెడ్జ్‌మెంట్లు కూడా ఇవ్వట్లేదు. నిరంతరాయంగా తనిఖీలు చేస్తూ మార్గదర్శి రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కల్పిస్తోంది. చిట్టీ వాయిదాలు చెల్లించొద్దంటూ చందాదారులకు చెబుతోంది.

Margadarsi chitfunds updates: మార్గదర్శి చిట్‌గ్రూపుల నిలిపివేత ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

చందాదారులు కట్టిన చిట్టీల గురించి ఆరాతీస్తూ... వారి ఆదాయ మార్గాలేంటి? ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? లేదా? తదితర వివరాలు సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. చాలా సందర్భాల్లో చందాదారులు ఆ వివరాలు ఇవ్వటానికి నిరాకరిస్తుండటంతో వారికి రాత్రి వేళల్లో ఉద్దేశపూర్వకంగానే ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు. సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు వారికి ఇష్టమొచ్చినట్లుగా రాసుకున్న వాంగ్మూలాలపై సంతకాలు చేయాలంటూ చందాదారులను బెదిరిస్తున్నారు. మార్గదర్శి చిట్ వ్యాపారాన్ని ప్రభుత్వం మూసివేస్తుందని.. డబ్బులు చెల్లించొద్దని చందాదారులకు చెబుతున్నారు. బృందాల సాయంతో రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చందాదారులను, ఏజెంట్లను మార్గదర్శి కార్యాలయాలకు పిలిపించి గంటల తరబడి కూర్చోబెడుతున్నారు.

AP CID Third Day Raids at Margadarsi Branches: మార్గదర్శిపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు.. వరుసగా మూడో రోజు తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.