ETV Bharat / bharat

Margadarshi: ఈనాడుపై కక్షతోనే మార్గదర్శి సంస్థపై సీఐడీ ఏఫ్​ఐఆర్​లు​

author img

By

Published : Jul 25, 2023, 8:21 AM IST

Updated : Jul 25, 2023, 11:15 AM IST

FIRs against Margadarshi Chit Fund Company: ఈనాడుపై కక్షతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై వరుస ఏఫ్​ఐఆర్​లు నమోదుచేసి వేధిస్తోందని ఆ సంస్థ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టుకు సోమవారం విన్నవించారు. ఏఫ్​ఐఆర్​ నమోదు చేసినంత మాత్రాన దాన్ని ఏపీలోనే సవాలు చేయాలని లేదని 40ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఎక్కడ ఉంటే అక్కడ కేసు పెడతారని.. వాదించారు. అంతకుముందు వాదనలు వినిపించిన ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ నీరజ్‌ కిషన్‌ కౌల్‌ ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన ఏఫ్​ఐఆర్​లపై విచారించే అధికారం తెలంగాణ హైకోర్టుకు లేదన్నారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్‌ సీటీ రవికుమార్‌.. తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేశారు.

FIRs against Margadarshi Chit Fund Company
ఈనాడుపై కక్షతోనే మార్గదర్శి సంస్థపై సీఐడీ ఏఫ్​ఐఆర్​లు​

ఈనాడుపై కక్షతోనే మార్గదర్శి సంస్థపై సీఐడీ ఏఫ్​ఐఆర్​లు​

FIRs against Margadarshi Chit Fund Company: రాజకీయ కక్షతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై వరుస ఏఫ్​ఐఆర్​లు నమోదుచేసి వేధిస్తోందని ఆ సంస్థ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌లో చిట్‌ చందాదారుల నుంచి వసూలు చేసిన డబ్బును నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌కు తరలించారని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను తెలంగాణ హైకోర్టు విచారించడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుపై జస్టిస్‌ సీటీ రవికుమార్‌, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం విచారణ జరిగింది.

మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏఫ్​ఐఆర్​ నమోదు చేసినంత మాత్రాన దాన్ని ఆ రాష్ట్రంలోనే సవాలు చేయాలని లేదని 40 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఎక్కడ ఉంటే అక్కడ కేసు పెడతారన్నారు. ఈ కేసులో ఏపీలోని చందాదారుల నుంచి వసూలైన మొత్తాన్ని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలించి, అక్కడి నుంచి మ్యూచువల్‌ ఫండ్లకు మళ్లించారని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారని చెప్పారు. దాని ప్రకారం ఇక్కడ కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌లో అధిక భాగం హైదరాబాద్‌లో ఉందని.. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నవారు హైదరాబాద్‌లో ఉంటున్నారన్నారు.

ఈనాడు పేపర్‌ను నిర్వహిస్తున్న రామోజీరావే మార్గదర్శి సంస్థనూ నడుపుతున్నారని.. మార్గదర్శికి వ్యతిరేకంగా ఒక్క చందాదారూ ఫిర్యాదుచేయలేదన్నారు. ఇవి పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడిన కేసులన్నది తమ అభిప్రాయమని ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శత్రుత్వం ఉందన్న కారణంతో సుప్రీంకోర్టు ఇదివరకు ఒక రిట్‌ పిటిషన్‌ను ఏపీ నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులోనూ రోజూ ఒకటి తర్వాత ఒకటిగా ఏఫ్​ఐఆర్​లు నమోదుచేస్తున్నట్లు హైకోర్టు గుర్తించింది. ఇందులో కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ అధిక భాగం హైదరాబాద్‌లోనే ఉన్నట్లు చెబుతున్నందున తెలంగాణ హైకోర్టుకు ఈ కేసును విచారించే పరిధి లేదని ఎలా చెప్పగలరని ముకుల్‌ రోహత్గీ వాదించారు.

అప్పుడు జస్టిస్‌ సీటీ రవికుమార్‌ జోక్యం చేసుకుంటూ ఇక్కడ మోసం, క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ జరిగినట్లు ఆరోపిస్తున్నారని.. శాఖల్లో వసూలైన మొత్తాన్ని ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు చెబుతున్నారన్నారు. ప్రధాన కార్యాలయంలో ఏం జరిగిందన్నది చూడాలా అన్న విషయాన్ని ఆలోచిస్తున్నామని జస్టిస్‌ సీటీ రవికుమార్‌ పేర్కొన్నారు. ఒకవేళ అదే ఫ్యాక్టర్‌ అయితే శాఖల నుంచి ప్రధాన కార్యాలయానికి పోయిన డబ్బును మళ్లించినట్లు చెప్పడానికి వీల్లేదని.. సాధారణంగా ఎక్కడైనా అన్ని శాఖల నుంచి ప్రధాన కార్యాలయానికి వెళ్తాయని అన్నారు.

న్యాయమూర్తి వ్యాఖ్యలతో మార్గదర్శి న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ఏకీభవించారు. తర్వాత ఆయన వాదనలు కొనసాగిస్తూ.. విచారణకు తాము సహకరించినందు వల్ల మొత్తం 7 ఏఫ్​ఐఆర్​లలో 3, 4 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయినప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేయాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఛార్జిషీట్‌ దాఖలైతే దర్యాప్తు పూర్తయినట్లే కాబట్టి బెయిల్‌కు అవకాశం ఉంటుందని 87 ఏళ్ల రామోజీరావుకు హైకోర్టు ఉత్తర్వులు రక్షణ కల్పిస్తున్నాయని అనుకున్నా.. ఆయన విచారణకు సహకరించడం వల్లే పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాల్సిన అవసరం ఏముందని? అది మరో వివాదానికి తావిస్తుందని ముకుల్‌ రోహత్గీ అన్నారు. అంతకుముందు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ నీరజ్‌ కిషన్‌ కౌల్‌ వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చందాదారుల నుంచి వసూలైన మొత్తాన్ని అక్రమంగా తరలించారని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు ఏఫ్​ఐఆర్​లు దాఖలు చేశారని.. ఇక్కడ డబ్బు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలిపోయిందన్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన ఏఫ్​ఐఆర్​పై విచారించే అధికారం తెలంగాణ హైకోర్టుకు లేదన్నారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్‌ సీటీ రవికుమార్‌.. ఈ జ్యూరిస్‌డిక్షన్‌కు సంబంధించిన కేసుతో పాటు, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్లన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని చెబుతూ తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేశారు.

Last Updated : Jul 25, 2023, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.