ETV Bharat / state

AP CID Third Day Raids at Margadarsi Branches: మార్గదర్శిపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు.. వరుసగా మూడో రోజు తనిఖీలు

author img

By

Published : Aug 19, 2023, 2:02 PM IST

AP CID Third Day Raids at Margadarsi Branches: మార్గదర్శి సంస్థపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండురోజులుగా మార్గదర్శి చిట్స్​కు సంబంధించిన బ్రాంచిల్లో సోదాలు నిర్వహిస్తున్న పలు శాఖల అధికారులు.. వరుసగా మూడో రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు.

AP_CID_Third_Day_Raids_at_Margadarsi
AP_CID_Third_Day_Raids_at_Margadarsi

AP CID Third Day Raids at Margadarsi Branches: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కక్ష సాధింపే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం తన కుట్రలను కొనసాగిస్తోంది. మార్గదర్శి చిట్స్‌కు సంబంధించిన బ్రాంచిల్లో రెండురోజులుగా సోదాలు నిర్వహిస్తున్న సీఐడీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు తదితర శాఖల అధికారులు.. వరుసగా మూడోరోజూ తనిఖీలు కొనసాగిస్తున్నారు.

విజయనగరం మార్గదర్శి బ్రాంచ్​లో సీఐడీ సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. సీఐడీ డీఎస్పీ భూపాల్ ఉదయం 10న్నర గంటలకు తనిఖీలు ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన చిట్ రిజిస్ట్రార్ కీర్తిప్రియ, వారి సహయకులు ఉదయం 10గంటలకే మార్గదర్శి కార్యాలయానికి చేరుకొని.. చిట్ మొత్తాలు, ఖాతాదారులకు చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తున్నారు.. తిరుపతి మార్గదర్శి కార్యాలయంలో మూడో రోజు సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయం లోపలికి వస్తున్న కస్టమర్లు, ఇతరుల వివరాలను కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పోలీసులు సేకరించి లోపలికి అనుమతిస్తున్నారు.

AP CID Officers Attend to Telangana High Court: మార్గదర్శి కేసు.. ఏపీ సీఐడీ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం

YSRCP Government Actions on Margadarsi Chits: కడప, ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయాలకు మూడో రోజు ఉదయం 9 గంటలకే అధికారులు చేరుకుని తనిఖీలు మొదలుపెట్టారు. కడప మార్గదర్శి కార్యాలయానికి జిల్లా చిట్ రిజిస్ట్రార్‌ భారతితో పాటు సీఐడీ సీఐ ఆంజనేయ ప్రసాద్ బృందం చేరుకొని.. సోదాలు నిర్వహిస్తోంది. కడప మార్గదర్శి కార్యాలయంలో ఇటీవల క్లోజ్ అయిన 13 గ్రూపులకు సంబంధించి వివరాలను ఆరా తీస్తున్నారు. మినిట్ పుస్తకంలో ఏజెంట్లు, కస్టమర్లు పెట్టిన సంతకాలను పరిశీలన చేస్తున్నారు.

కస్టమర్లకు ఫోన్ చేసి.. చిట్‌ పాడుకున్న సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా..? మార్గదర్శి సిబ్బంది ఏమైనా ఇబ్బందులు పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని.. అంత సవ్యంగా సాగిందని కస్టమర్లు చెప్పినప్పటికీ.. వారిని తికమక పెట్టే ప్రశ్నలు అడుగుతూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయంలోనూ కస్టమర్లు, ఏజెంట్లకు సంబంధించిన వివరాలను.. ఉదయం నుంచి పరిశీలన చేస్తున్నారు.

Attacks on Margadarsi Offices: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు

శ్రీకాకుళం మార్గదర్శి కార్యాలయంలో వరుసగా 3 వ రోజు సిఐడి, రిజిస్ట్రేషన్ ఆఫ్ చిట్స్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ తో పాటు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు, కస్టమర్లకు ఫోన్ చేసి కార్యాలయానికి రావాలంటు ఒత్తిడి చేస్తున్నారు.

Raids In Margadarsi Chits Funds Branches: అనంతపురం మార్గదర్శి బ్రాంచ్‌లో మూడో రోజు సీఐడీ అధికారుల సోదాలు చేపట్టారు. సిబ్బందిని ఎవరిని లోపలికి అనుమతించలేదు. కార్యాలయం ప్రధాన గేటు మూసేశారు. శనివారం నుంచి సిబ్బంది విధులకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పిన సీఐడీ అధికారులు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఐడి కార్డులతో కార్యాలయానికి వచ్చిన సిబ్బందిని అడ్డుకొని.. తిరిగి వెనక్కు పంపారు. కేవలం కంప్యూటర్ ఆపరేటర్లు, క్లర్క్లు, మేనేజర్ ను మాత్రమే లోపలికి అనుమతించి, ఫీల్డ్ స్టాఫ్ ను వెలుపలికి పంపారు.

AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు.. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా

బ్రాంచ్ లో కంప్యూటర్లలో ఉన్న యావత్తు సమాచారాన్ని గతంలోనే తీసుకెళ్లారని.. కొత్తగా ఇంకా ఎలాంటి సమాచారం ఉందో మీరే చెప్పాలంటూ సీఐడీ అధికారులను బ్రాంచి సిబ్బంది ప్రశ్నించారు. రేపు చిట్టి గ్రూపులు ఆప్షన్ ఉన్నందున ఇవాళ వినియోగదారులు నెలవారి కంతులు చెల్లించటానికి వస్తారని.. వారిని అడ్డుకోవద్దు అంటూ బ్రాంచి సిబ్బంది.. సీఐడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Raids in Margadarsi Branches in AP: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 5 మార్గదర్శి కార్యాలయాల్లో మూడో రోజున సోదాలు ప్రారంభమయ్యాయి. సీఐడీ అధికారులతో పాటు చిట్ రిజిస్ట్రార్, రెవెన్యూ , మున్సిపల్, కార్మికశాఖలకు సంబంధించిన అధికారులు వీరిలో ఉన్నారు. గుంటూరులోని అరండల్ పేట, మార్కెట్ సెంటర్, నరసరావుపేట, చీరాల, తెనాలి మార్గదర్శి శాఖల వద్ద పోలీసులను కాపలా ఉంచి తనిఖీలు చేస్తున్నారు.

Margadarsi Case: 'మార్గదర్శి మూసివేతకు ఏపీ ప్రభుత్వ కుట్ర.. చట్టనిబంధనల ముసుగులో కక్షసాధింపు'

మార్గదర్శి సిబ్బంది ఫోన్ల వినియోగంపై కొన్నిచోట్ల ఆంక్షలు విధించారు. కార్యాలయాలకు వస్తున్న ఖాతాదారులను ఏ పని మీద వచ్చారో అడిగి.. పేరు తెలుసుకుని లోపలికి పంపిస్తున్నారు. ఆదివారం జరిగే చిట్‌ వేలానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి ఉండగా.. తనిఖీలతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో చోట 8నుంచి 12మంది వరకూ అధికారులతో కూడిన బృందాలు సోదాలు చేస్తున్నాయి.

Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.