ETV Bharat / bharat

Viveka Murder Case: అప్పటివరకు అవినాష్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

author img

By

Published : Mar 10, 2023, 2:04 PM IST

Updated : Mar 10, 2023, 3:44 PM IST

telangana high court
telangana high court

MP Avinash Reddy Case: కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం సమర్పించాలంది. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ అవినాష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

MP Avinash Reddy Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులోఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయవద్దని సీబీఐను తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా హైకోర్టు తీవ్రమైన చర్యలంటే ఏంటని న్యాయస్థానం ప్రశ్నించగా... అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అడుగుతున్నారా? అని తెలిపింది. దీనిపై అవినాష్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చెప్పింది చెప్పినట్లు సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారనే నమ్మకం తమకు లేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ విచారణను వీడియో రికార్డింగ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. వీడియో రికార్డింగ్‌ ఏ దశలో ఉందో తెలపాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను సోమవారం సమర్పించాలని ఆదేశించింది.

కేసు విచారణలో భాగంగా ఆడియో, వీడియో రికార్డుల హార్డ్‌ డిస్క్‌ను సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ హైకోర్టుకు తీసుకొచ్చామని తెలిపారు. కేసుకు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌, కేసు ఫైల్‌ ఇప్పుడే ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి వెల్లడించారు. సోమవారం సీల్డ్‌ కవర్‌లో అవినాష్‌ వివరాలు, హార్డ్‌ డిస్క్‌ ఇవ్వాలని సీబీఐని తెలంగాణ కోర్టు ఆదేశించించగా.... అప్పటివరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌ తరఫు న్యాయవాది కోరారు. అవినాష్‌రెడ్డి.. సాక్షా? లేక నిందితుడా? అని సీబీఐని తెలంగాణ కోర్టు ప్రశ్నించింది.

అవినాష్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చామని.. అవసరమైతే అవినాష్‌ను, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో సోమవారం వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం.. అవసరమైతే ఆయన మంగళవారం మరోసారి కోర్టుకు హాజరవుతారని పేర్కోంది.

ఇక రెండు సార్లు కడప ఎంపీగా ఎన్నికైన తనను.. సీబీఐ అధికారులు ఏకపక్షంగా విచారణకు పిలిచి ఇరికించాలని చూస్తున్నారని అవినాష్ ఆరోపించారు. వివేకా హత్య ఏవిధంగా జరిగి ఉంటుందో సీబీఐ ముందే నిర్ణయించుకుందని.. ఆ మేరకే విచారణ చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపణలు చేశారు. మిగిలిన కోణాల్లో కాకుండా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విచారణ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా 2010లో ముస్లిం మహిళ షమీమ్​ను రెండో వివాహం చేసుకున్నారని.. వారికి 2015లో కుమారుడు జన్మించినట్లు అవినాశ్‌ రెడ్డి పిటిషన్​లో వెల్లడించారు.

వివేకా తన ఆస్తిని షమీమ్ కుటుంబానికి రాసిస్తాడనే ఉద్దేశంతో.. చాలా సార్లు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమార్తె సునీత గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయన్నారు. వివేకా పేరుతో ఉన్న కంపెనీలకు సంబంధించిన చెక్ పవర్​ను కుమార్తె, అల్లుడు లాగేసుకున్నారని ఆరోపణలు చేశారు.షమీమ్ కుమారుడు పేరుతో 2 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని వివేకా భావించడంతోనే ఇంట్లో గొడవలు వచ్చాయని తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated :Mar 10, 2023, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.