ETV Bharat / bharat

ఆసక్తికరంగా మారిన అసెంబ్లీ పోరు - ఆధిపత్య పోరులో పాత ప్రత్యర్థుల హోరాహోరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 6:30 AM IST

Telangana Election War Between Old Rivals : శాసనసభ ఎన్నికలు ఈసారి ఆసక్తికర పోరుకు వేదిక కాబోతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాల తరఫున చాలా నియోజకవర్గాల్లో పాతకాపులే ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. పార్టీలు వేరైనా.. మరోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. గెలిచి పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అంతిమంగా ఆధిపత్య పోరులో ఆధిక్యమెవరికి దక్కుతుందో ఆసక్తికరంగా మారింది.

Telangana Assembly Election 2023
Telangana Election War Between Old Rivals

ఆధిపత్య పోరులో పాత ప్రత్యర్థుల హోరాహోరీ-ఆసక్తికరంగా మారిన అసెంబ్లీ పోరు

Telangana Election War Between Old Rivals : రాష్ట్రంలో శాసనసభ సమరం ముంగిట కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆయా స్థానాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రత్యర్థులుగా మరోసారి బరిలో దిగుతున్నారు. పలు నియోజకవర్గాల్లో(Constituencies) నాలుగోసారి, మూడోసారి పోటీపడుతున్న నేతలతో తాజా ఎన్నికలు ఆసక్తికర పోరుకు వేదిక కాబోతున్నాయి. ఇప్పటికే నాలుగైదు సార్లు తలపడిన అభ్యర్థులే మళ్లీ పోటీ పడుతుండటం.. రాజకీయ క్రీడను రసవత్తరంగా మార్చబోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు చిరకాల ప్రత్యర్థులే అయినా.. పలువురు నాయకుల పార్టీలు వేరు కావడం గమనార్హం.

రాజకీయ క్రీడలో చిరకాల ప్రత్యర్థులు-గెలుపు ఎవరిదో..? అందోలు నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహా, బాబూమోహన్‌ ఆరోసారి తలపడుతూ రాష్ట్రంలోనే చిరకాల ప్రత్యర్థులుగా గుర్తింపు పొందారు. 1999 నుంచి రాజనర్సింహా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. బాబూమోహన్‌ తెలుగుదేశం(TDP), టీఆర్ఎస్, బీజేపీ తరఫున బరిలో నిలిచారు. 1999లో టీడీపీ తరఫున బాబూమోహన్‌ విజయం సాధించగా.. 2004, 2009 ఎన్నికల్లో రాజనర్సింహా గెలుపొందారు.

2014లో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన బాబూమోహన్‌ను విజయం వరించింది. 2018లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్‌ గెలుపొందగా.. రాజనర్సింహా, బాబూమోహన్‌ ఓటమి చవిచూశారు. తాజాగా.. అందోల్‌ నుంచి ప్రత్యర్థులుగా రాజనర్సింహా,బాబూమోహన్‌ బరిలో దిగుతున్నారు.

Babu Mohan Clarity on Assembly Elections Contest : 'పార్టీలో చాలా అవమానాలు జరిగాయి.. ఈసారి ఎన్నికల పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా'

Election Clash Between Old Rivals : నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున శ్రీహరిరావు బరిలో నిలిచారు. 2009 నుంచి ఈ ముగ్గురూ పార్టీలు మారుతూ పోటీచేస్తూనే ఉన్నారు. మంత్రపురిగా పిలిచే మంథనిలో ప్రస్తుత శాసనసభ్యుడు(Member of Legislative Assembly) దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పుట్ట మధుకర్‌ మధ్య నాలుగోసారి పోరు జరగబోతోంది. 2009లో శ్రీధర్‌బాబు.. మధుకర్‌పై విజయం సాధించారు. 2014లో మధు టీఆర్ఎస్ తరఫున గెలిచారు. 2018లో శ్రీధర్‌బాబు గెలుపొందారు.

మధిర స్థానంలో భట్టి విక్రమార్క(CLP Bhatti Vikramarka) ఖమ్మం జెడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజ్ నాలుగోసారి పోటీ పడుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా భట్టి విజయం సాధించారు. కమల్‌రాజ్ వరుసగా పోటీ చేసి ఓటమి చెందారు. బోధన్‌లో మహమ్మద్‌ షకీల్‌, సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి ప్రత్యర్థులుగా అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ 2009లో సుదర్శన్‌రెడ్డి గెలుపొందగా.. 2014, 2018లో షకీల్‌ జయభేరీ మోగించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్‌ నాలుగోసారి తలపడబోతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేతలతో సుడిగాలి ప్రచారాలకు ప్లాన్​​, ఈ నెల 17న తెలంగాణకు రాహుల్​ గాంధీ

Telangana Assembly Election 2023 : కుత్బుల్లాపూర్‌లో కూన వివేకానంద్‌, కూన శ్రీశైలంగౌడ్‌ నాలుగోసారి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కె.హన్మంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. కల్వకుర్తిలో భారతీయ జనతా పార్టీ తరఫున వరుసగా నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థిగా తల్లోజు ఆచారి ప్రత్యేకత సొంతం చేసుకున్నా ఒక్కసారీ గెలవలేకపోయారు. ఇక్కడ 2009లో జైపాల్‌యాదవ్‌ , 2014లో చల్లా వంశీచంద్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారి జైపాల్‌, ఆచారి ఇద్దరూ మళ్లీ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు.

నిను వీడని నీడను నేనే..: చేవెళ్లలో ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య , కేఎస్ రత్నం నాలుగోసారి తలపడనున్నారు. కేఎస్ రత్నం నాలుగు దఫాలుగా.. నాలుగు పార్టీల నుంచి పోటీలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా భీం భరత్‌ బరిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(Manchireddy Kishanreddy), మల్‌రెడ్డి రంగారెడ్డి మూడోసారి పోటీపడుతున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి వరుసగా ఓటమి పాలవగా.. మంచిరెడ్డి స్వల్ప ఆధిక్యంతో బయటపడుతుండటం విశేషం.

'ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు'

రాష్ట్రంలో ప్రాధాన్యం సంతరించుకున్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మంత్రి కేటీఆర్.. కేకే మహేందర్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు తలపడగా... ఈ ఎన్నికల్లోనూ మరోసారి బరిలోకి దిగారు. ధర్మపురి నియోజకవర్గంలోనూ పాతకాపులే మరోసారి పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్‌(Minister Koppula Eshwar) బరిలో ఉండగా.. నిను వీడను నీడను నేను అంటూ సుదీర్ఘ పోరాటం చేస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం పోటీకి నిలిచారు. 2009 నుంచి వీరి మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. స్వల్ప తేడాతో ఓటమి పాలవుతున్న అడ్లూరి..ఈసారి ఎలాగైనా మంత్రిని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు.

'కరెంట్​, రైతుబంధుపై- కేసీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు'

ఊపందుకున్న ఎన్నికల ప్రచారాలు, ఓటర్ల అనుగ్రహం కోసం ముమ్మర ప్రయత్నాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.