ETV Bharat / state

కాంగ్రెస్ అగ్రనేతలతో సుడిగాలి ప్రచారాలకు ప్లాన్​​, ఈ నెల 17న తెలంగాణకు రాహుల్​ గాంధీ

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 3:37 PM IST

Updated : Nov 13, 2023, 4:19 PM IST

Rahul Gandhi Election Campaign in Telangana : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఇదే రోజున పాలకుర్తి, వరంగల్‌, భువనగిరిలో రాహుల్ సభలు ఉండనున్నాయి. రేపటిలోగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో వివిధ తేదీల్లో ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.

Etv Bharat
Rahul Gandhi Election Campaign in Telangana

Rahul Gandhi Election Campaign in Telangana : రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. కాంగ్రెస్‌(Congress) పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. హస్తం పార్టీ అగ్రనేతలతో మరింత వేగంవంతం చేయాలని నిర్ణయించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాల్లో.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు జాతీయ స్థాయినేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో ప్రచారం.. తుది దశకు చేరుకోనుంది.

'బీఆర్ఎస్ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు'

Telangana Assembly Elections 2023 : ఇక తెలంగాణలోనూ ప్రచారం చేయడానికి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఇదే రోజున పాలకుర్తి, వరంగల్‌, భువనగిరిలో రాహుల్ సభలు ఉండనున్నాయి. రాష్ట్రంలో వివిధ తేదీల్లో ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ రెండు హెలీకాప్టర్‌లను సిద్ధం చేసుకుంది. ఒకే రోజు రాష్ట్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశాలు ఉండే అవకాశాలున్నాయి.

ఇవాళ రేపట్లో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో వీఐపీ పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఈ నెల 17వ తేదీ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పర్యటనలు ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణపై ఏఐసీసీ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం.. నేతల మధ్య అంతరాలు వంటి అంశాలపై ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులతో సమీక్షించారు.

Congress Election Campaign in Telangana : రాష్ట్రంలో కేసీఆర్​ పాలనపై ప్రజలు విసిగిపోయారని.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని.. నేతలంతా ఐక్యంగా పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే.. ఇకపై జరిగేది అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రచారాన్ని మరింత సమర్థంగా నిర్వహించేలా ముందుకెళ్లాలని సూచించారు.

ఈ నెల 7 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే బీఆర్​ఎస్​ వైఖరిని ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులను లక్ష్యంగా.. రేవంత్​రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ తీరుపైన రేవంత్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు వంటి అంశాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు.

రేవంత్​ రెడ్డి వర్సెస్​ అసదుద్దీన్​ ఒవైసీ-ఆ సవాల్​కు సిద్ధమై అంటూ రేవంత్​ వ్యాఖ్యలు

మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం

Last Updated : Nov 13, 2023, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.