ETV Bharat / bharat

అప్పుడు ఆత్మహత్యాయత్నం- ఇప్పుడు 'పది'లో స్టేట్​ టాపర్​

author img

By

Published : Oct 13, 2021, 4:36 PM IST

Updated : Oct 13, 2021, 8:02 PM IST

కర్ణాటక పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో(Sslc Supplementary Result 2021) ఓ బాలిక తన సత్తా చాటింది. ఒకప్పుడు మెయిన్ పరీక్షలు రాయలేక ఆత్మహత్యకు యత్నించిన ఆ బాలికే.. ఇప్పుడు రాష్ట్రంలోనే టాపర్​గా నిలిచింది. ఆ బాలిక విజయగాథ మీకోసం..

SSLC Exam topper
ఎస్​ఎస్​ఎల్​సీ పరీక్ష ఫలితాలు

అప్పుడు ఆత్మహత్యాయత్నం- ఇప్పుడు 'పది'లో స్టేట్​ టాపర్​

పట్టుదల ఉంటే.. ఓడిపోయిన చోటే విజేతగా నిలిచి చూపించొచ్చు. అవమానాలు ఎదుర్కొన్న చోటే అందరితో ప్రశంసలు అందుకోవచ్చు. ఈ విషయాన్ని నిజం చేసి నిరూపించింది కర్ణాటకకు చెందిన ఓ బాలిక. ఆర్థిక సమస్యల కారణంగా పదో తరగతి పరీక్షలు రాయలేక ఆత్మహత్యకు యత్నించిన ఆ బాలిక.. ఇప్పుడు సప్లిమెంటరీ ఫలితాల్లో రాష్ట్రంలోనే టాపర్​గా నిలిచింది.

SSLC Exam topper
ఎస్​ఎస్​ఎల్​సీ పరీక్ష ఫలితాల్లో టాపర్​గా నిలిచిన గరిశ్మ

సెప్టెంబర్ 27, 29 తేదీల్లో కర్ణాటక ఎస్​ఎస్​ఎల్​సీ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను(sslc supplementary result 2021) ఇటీవలే ప్రకటించారు. అందులో.. తుముకూరు జిల్లా(Karnataka Tumkur News) కూరటగెరె ప్రాంతానికి చెందిన గిరీశ్మ.. రాష్ట్రంలోనే టాపర్​గా నిలిచింది. 625 మార్కులకుగాను ఆమె 599 మార్కులను సాధించింది.

ఎందుకు ఆత్మహత్యాయత్నం?

మూడబిదిరిలోని అల్వాస్​ పాఠశాలలో చదివిన గిరీశ్మ 9వ తరగతిలో 97శాతం మార్కులను సాధించింది. అయితే.. కరోనాతో విధించిన లాక్​డౌన్ కారణంగా ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. పాఠశాల ఫీజులు చెల్లించకపోవడం వల్ల ఆమె పదో తరగతిలో చేరలేకపోయింది.

SSLC Exam topper
తల్లిదండ్రులతో గిరీశ్మ

ఎస్​ఎస్​ఎల్​సీ పరీక్ష రిజిస్ట్రేషన్​ కోసం గిరీశ్మ తల్లిదండ్రులు పాఠశాలలో వాకబు చేయగా వారికి.. తమ కూతురు పదో తరగతి పరీక్షలు రాసేందుకు అర్హురాలు కాదని తెలిసింది. దీనిపై గిరీశ్మ విద్యార్థుల హక్కుల కమిషన్​కు, విద్యా శాఖ మంత్రికి ఈ మెయిల్ ద్వారా తన దీనస్థితిని తెలియజేసింది. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో విసుగు చెందిన గిరీశ్మ.. జులై 17న ఆత్మహత్యకు యత్నించింది.

అయితే.. ఆ తర్వాత కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేశ్​ కుమార్.. గిరీశ్మ ఇంటిని సందర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. దాంతో ఎస్​ఎస్​ఎల్​సీ మెయిన్ పరీక్షలు రాయలేకపోయినా.. సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం వచ్చింది. ఈ పరీక్షల్లో పట్టుదలతో చదివి ఏకంగా స్టేట్​ టాపర్​గా నిలిచింది గిరీశ్మ. ఎంతో మందికి ఆదర్శంగా నిలించింది.

ఇదీ చూడండి: Lota Race: చెంబులు పట్టుకుని మహిళల పరుగో పరుగు

ఇదీ చూడండి: ఒకేసారి 550 కేక్స్​ కట్ చేసి పుట్టిన రోజు వేడుక

Last Updated : Oct 13, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.