ETV Bharat / bharat

Sankashti Chaturthi September 2023 : సంకష్టి చతుర్థి.. తిథి ఎప్పుడు..? పూజావిధానం ఏంటో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 5:20 PM IST

Updated : Sep 2, 2023, 9:34 AM IST

Sankashti Chaturthi September 2023 : హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి నెలా కృష్ణ పక్షంలో చతుర్థి లేదా చవితి తిథి రోజున సంకష్టి చతుర్థి వస్తుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో సంకష్టి చతుర్థి ఎప్పుడొచ్చింది..? ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి? ఆచరించాల్సిన పూజా విధానం ఏంటి?

Sankashti Chaturthi September 2023
Sankashti Chaturthi

What is Sankashti Chaturthi : హిందువులు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా.. నిర్విఘ్నంగా జరిగేలా చూడమని వినాయకుడిని పూజిస్తారు. ఇక, హిందూ పంచాంగం ప్రకారం.. లంబోదరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి చవితి లేదా చతుర్థి. అందుకే.. ఈ వేళలో హిందువులు నిష్టతో రెండు రకాల పూజలను జరుపుకుంటారు. ఇందులో మొదటి పూజను వరద చతుర్థి, రెండో పూజను సంకష్టి చతుర్థి పేరిట జరుపుకుంటారు. అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అనీ, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టి చతుర్థి అని అంటారు.

Sankashti Chaturthi September 2023 Time : ఈ పవిత్రమైన రోజున భక్తులు గణపతికి(Lord Ganesh) ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో 2023, సెప్టెంబర్ నెలలో సంకష్టి చతుర్థి ఎప్పుడొచ్చింది? ఆ రోజున ఆచరించాల్సిన పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం.. ఈ సంకష్టి చతుర్థి వ్రతం, పూజావిధానం, ఈ వ్రతం ప్రాముఖ్యత గురించ నరసింహ పురాణంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. సంకష్టి చతుర్థి 2023, సెప్టెంబర్ 2, 3 తారీఖుల్లో వచ్చింది.

చతుర్థి తిథి ప్రారంభం : 02 సెప్టెంబర్ 2023, శనివారం రాత్రి 8:49 గంటలకు

చతుర్థి తిథి ముగింపు : 03 సెప్టెంబర్ 2023, ఆదివారం సాయంత్రం 6:24 గంటలకు

మన బొజ్జ గణపయ్యకు ఏం ఇష్టమో తెలుసా..?

Sankashti Chaturthi Vrat and Puja Procedure : సంకష్టి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలనుకునే వారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఆ రోజంతా వ్రతం చేసే వారు ఉపవాసం ఉండాలి. సంకష్టి అనేది క్లిష్ట పరిస్థితులలో ఉపశమనాన్ని సూచిస్తుంది. పూజలన్నీ సాధారణంగా ఉదయాన్నే జరుగుతాయి. కానీ.. ఈ సంకష్టి చతుర్థి వ్రతం(Sankashti Chaturthi Vrat) మాత్రం సాయం కాలంలో(అంటే చంద్రుడు ఉదయించే సమయంలో) జరుపుకోవాలి.

ఇంతటి పవిత్రమైన రోజున భక్తులు వినాయక విగ్రహాన్ని లేదా ఫొటోను దూర్వా గడ్డి, తాజా పువ్వులతో అలంకరించి.. పిండి వంటలు, ప్రసాదం, మోదకాన్ని ఏకదంతునికి సమర్పించాలి. పూజా సమయంలో భక్తులు దీపాలు వెలిగించేటప్పుడు ఈ వ్రతానికి సంబంధించిన కథను భక్తి శ్రద్ధలతో చదవాలి. అలాగే వినాయక మంత్రాలు, స్తోత్రాలను.. వ్రతం ఆచరించే భక్తులు తప్పనిసరిగా పఠించాలి.

బొజ్జ గణపయ్య మెచ్చే నైవేద్యాలు.. మీరూ ట్రై చేయండి..

Sankashti Chaturthi Rules in Telugu : ఈ సంకష్టి చతుర్థి పూజ ముగిసిన తర్వాత వ్రతాన్ని ఆచరించిన వారు చంద్రుడిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాలనే విషయం భక్తులు గుర్తుంచుకోవాలి. అంతకంటే ముందు వ్రతాన్ని చేసిన వారు చంద్రుడికి నైవేధ్యంగా నీరు, గంధం, బియ్యం, పూలు సమర్పించాలి. అంటే ఈ పర్వదినం రోజు భక్తులు లంబోదరుడితో పాటు చంద్రుడిని పూజిస్తారు. మరో విషయం ఏమిటంటే ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచారిస్తారో వారు ఆ రోజున పూర్తిగా ఉపవాసం ఉండలేమనుకుంటే.. పాలు, పండ్లను తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు వ్రతమాచరించే వారు ఉల్లి, వెల్లుల్లితో పాటు మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.

Khairatabad Ganesh Height 2023 : శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు.. ఈ ఏడాది ఎత్తు ఎంతో తెలుసా..

Lord Ganesh History : బొజ్జగణపయ్యకు 'గణపతి' అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా..?

Last Updated :Sep 2, 2023, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.