ETV Bharat / bharat

ఆటో, బస్సు ఢీ.. 9 మంది మృతి.. అందరూ రోజువారీ కూలీలే

author img

By

Published : Aug 9, 2022, 7:17 PM IST

Updated : Aug 9, 2022, 9:58 PM IST

road accident news
ఆటో, బస్సు ఢీ.. అనేక మంది మృతి

19:10 August 09

ఆటో, బస్సు ఢీ- 9 మంది కూలీలు మృతి

road accident news
ఆటో, బస్సు ఢీ.. అనేక మంది మృతి

బంగాల్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బీర్భమ్ జిల్లా మల్లర్​పుర్​లో మంగళవారం జరిగిందీ ఘటన.
స్థానికుల కథనం ప్రకారం.. రామ్​పుర్హట్​ నుంచి మల్లర్​పుర్​ వెళ్తున్న ఆటో.. 60వ నంబరు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఆర్​టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. వీరిలో 8 మంది మహిళా కూలీలు కాగా మరొకరు ఆటో డ్రైవర్. కూలీలంతా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

ప్రధాని మోదీ సంతాపం..
బంగాల్​లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్​గేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఇస్తామని మోదీ తెలిపారు.

Last Updated : Aug 9, 2022, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.