ETV Bharat / bharat

టెన్త్ అర్హతతో రైల్వేలో అప్రెంటీస్​ పోస్టులు- ఎగ్జామ్​ లేకుండానే ఉద్యోగం!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 11:57 AM IST

BLW Varanasi Apprenticeship Recruitment 2023
Railway Apprenticeship 2023

Railway Apprenticeship 2023 : ఇండియన్​ రైల్వేస్​లో అప్రెంటీస్​షిప్​ చేయాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్​న్యూస్​. వారణాసిలోని బనారస్​ లోకోమోటివ్​ వర్క్స్..​ అప్రెంటీస్​ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్​లు స్వీకరిస్తోంది. మరి దీనికి కావాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి​, దరఖాస్తు చివరితేదీ తదితర వివరాలు మీకోసం.

Railway Apprenticeship 2023 : పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త​. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని భారతీయ రైల్వేస్​కు చెందిన బనారస్​ లోకోమోటివ్​ వర్క్స్​ (బీఎల్‌డబ్ల్యూ) 2022-23 సంవత్సరానికి 46వ బ్యాచ్​ యాక్ట్​​ అప్రెంటీస్​ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 374 యాక్ట్ అప్రెంటీస్​ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఆసక్తిగల యువతీయువకులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు..
BLW Apprentice Vacancy : 374 యాక్ట్ అప్రెంటీస్​ పోస్టులు (ఐటీఐ- 300 ఖాళీలు, నాన్​-ఐటీఐ- 74 ఖాళీలు)

విద్యార్హతలు(BLW Apprentice Qualification)

  • నాన్ ఐటీఐ అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.
  • ఐటీఐ అప్రెంటీస్‌ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ఐటీఐ అప్రెంటీస్ ట్రేడ్స్(BLW Apprenticeship Trades)​..

  • ఫిట్టర్​
  • కార్పెంటర్​
  • పెయింటర్ (జనరల్)
  • మెషినిస్ట్​
  • వెల్డర్ (జి అండ్‌ ఇ)
  • ఎలక్ట్రీషియన్
  • నాన్ ఐటీఐ అప్రెంటీస్ ట్రేడ్స్​..
  • ఫిట్టర్​
  • కార్పెంటర్​
  • పెయింటర్ (జనరల్)
  • మెషినిస్ట్​
  • వెల్డర్ (జి అండ్‌ ఇ)
  • ఎలక్ట్రీషియన్

వయోపరిమితి(BLW Apprenticeship Age Limit)..

  • 2023 నవంబర్​ 25 నాటికి ఐటీఐ అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
  • నాన్-ఐటీఐ అప్రెంటీస్ అభ్యర్థుల వయసు 15 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలి.
  • ఐటీఐ వెల్డర్ అండ్‌ కార్పెంటర్ ట్రేడులకు అభ్యర్థుల వయసు 22 సంవత్సరాలు మించకూడదు.
  • నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు- 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం..
BLW Apprentice Selection Process : అకడమిక్స్​లో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్​ ఫీజు(BLW Apprentice Application Fees)..

  • అన్​రిజర్వ్​డ్​ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.100ను దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, రిజర్వ్​డ్​ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

ముఖ్యమైన తేదీలు(BLW Apprenticeship Important Dates)..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 2023 నవంబర్​ 25
  • ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల అప్లోడ్​కు చివరి తేదీ- 2023 నవంబర్​ 27

స్టైపెండ్​..
BLW Apprenticeship Stipend : భారతీయ రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం అప్రెంటీస్​ అభ్యర్థులకు స్టైపెండ్​ను చెల్లిస్తారు.

అధికారిక వెబ్​సైట్​..
BLW Official Website : నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం బనారస్ లోకోమోటివ్ వర్క్స్‌ అధికారిక వెబ్​సైట్​ blw.indianrailways.gov.inను వీక్షించవచ్చు.

ప్రభుత్వ రంగ బ్యాంకులో జాబ్స్​- రూ.లక్షకుపైగా శాలరీ! అప్లైకు లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

బీటెక్​, డిగ్రీ, డిప్లొమా అర్హతతో SSBలో ఎస్​ఐ ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.