ETV Bharat / bharat

ప్రభుత్వ రంగ బ్యాంకులో జాబ్స్​- రూ.లక్షకుపైగా శాలరీ! అప్లైకు లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 10:06 AM IST

Central Bank Of India Job Recruitment 2023
Central Bank of India Bank Jobs 2023

Central Bank Jobs 2023 : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మరి ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, జీతభత్యాలు, దరఖాస్తు చివరితేదీ, వయో పరిమితి తదితర వివరాలు మీకోసం.

Central Bank Jobs 2023 : ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించింది సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (Central Bank of India SO Recruitment 2023). తమ బ్యాంకుల్లోని స్పెషలిస్ట్‌ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 192 ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈ నియమకాలను చేపట్టనుంది సెంట్రల్​ బ్యాంక్. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులు(Central Bank Of India Job Vacancy)..

  • స్కేల్‌-I
  1. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- 15
  2. రిస్క్‌ మేనేజర్‌- 2
  3. సెక్యూరిటీ ఆఫీసర్‌- 15
  4. లైబ్రేరియన్‌- 1
  • స్కేల్‌-II
  1. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- 73
  2. లా ఆఫీసర్‌- 15
  3. క్రెడిట్‌ ఆఫీసర్‌- 50
  4. ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌- 4
  5. సీఏ- ఫైనాన్స్‌/అకౌంట్స్‌/జీఎస్టీ/ Ind AS/బ్యాలెన్స్‌ షీట్‌/ట్యాక్సేషన్‌- 3
  • స్కేల్‌-III
  1. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- 6
  2. ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌- 5

స్కేల్‌-IV

  1. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) : రిస్క్‌మేనేజర్‌- 1
  • స్కేల్‌-V
  1. ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- 1
  2. రిస్క్‌ మేనేజర్‌- 1

విద్యార్హతలు(Central Bank Of India Jobs Eligibility)..

  • ఇంజినీరింగ్‌, డేటా అనలిటిక్స్‌లో డిగ్రీ, ఎంబీఏ, ఎంబీఏ(ఫైనాన్స్‌), ఎంసీఏ, ఎమ్మెస్సీ(ఐటీ).. ఇలా పోస్టులను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు.
  • అలాగే సంబంధిత విభాగాల్లో గతంలో పనిచేసిన అనుభవం అభ్యర్థులకు తప్పనిసరిగా ఉండాలి.

వయో పరిమితి..
Central Bank Of India Jobs Age Limit : పోస్టులను అనుసరించి కనిష్ఠ వయస్సు 30 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 45 ఏళ్లు.

వేతనాలు వివరాలు..

స్కేల్‌ I ఉద్యోగాలకురూ.36,000 నుంచి రూ.63,840
స్కేల్‌ II పోస్టులకురూ.48,170 నుంచి రూ.69,810
స్కేల్‌ III ఉద్యోగాలకురూ.63,840 నుంచి రూ.78,230
స్కేల్‌ IV పోస్టులకురూ.76,010 నుంచి రూ.89,890
స్కేల్‌ V ఉద్యోగాలకురూ.89,890 నుంచి రూ.1,00,350

దరఖాస్తు ఫీజు(Central Bank Of India Jobs Application Fees)..

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175/-
  • మిగతా కేటగిరీ అభ్యర్థులకు రూ.850/-

ఎంపిక విధానం..
Central Bank Of India Jobs Selection Process : ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

పరీక్షా తేదీ..
Central Bank Of India Jobs Exam Date : రాత పరీక్షను డిసెంబర్‌ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించవచ్చు.

దరఖాస్తు చివరితేదీ..
Central Bank Of India Jobs Apply Last Date : 2023 నవంబర్‌ 19

జాబ్​ లొకేషన్​..
Central Bank Of India Job Location : పోస్టుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా శాఖల్లో అభ్యర్థులకు పోస్టింగ్​ కల్పిస్తారు.

అధికారిక వెబ్​సైట్​..
Central Bank Of India Official Website : నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాలు కోసం సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా అధికారిక వెబ్​సైట్​ www.centralbankofindia.co.in లేదా https://www.centralbankofindia.co.in/en/recruitmentsను వీక్షించవచ్చు.

డిగ్రీ, ఐటీఐ అర్హతతో NLCలో 877 అప్రెంటీస్​ పోస్టులు - అప్లైకు మరో 6 రోజులే ఛాన్స్​!

CISF Head Constable Jobs 2023 : ఇంటర్​ అర్హతతో.. CISFలో 215 హెడ్​ కానిస్టేబుల్​ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.