ETV Bharat / bharat

'కశ్మీర్‌' సమస్యకు త్వరలోనే రాజకీయ పరిష్కారం!

author img

By

Published : Jun 12, 2021, 6:14 AM IST

kashmir
‘కశ్మీర్‌’ సమస్యకు త్వరలోనే రాజకీయ పరిష్కారం!

జమ్ముకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగహోదా రద్దై ఏడాదిన్నర గడుస్తున్న నేపథ్యంలో కశ్మీర్‌పై వేగవంతమైన నిర్ణయాల దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ అంశంపై త్వరలోనే అన్ని పక్షాలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగహోదా రద్దు చేసిన ఏడాదిన్నర తర్వాత.. కశ్మీర్‌ భవిష్యత్తు నిర్ణయించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వీలైనంత త్వరగా లోయలో పూర్వస్థితిని పునరుద్ధరించాలని కోరుకొంటున్న ఆ ప్రాంత రాజకీయ పక్షాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో భేటీ కానున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ)గా ఏర్పడిన కశ్మీర్‌ ప్రాంత ఏడు ప్రధాన రాజకీయపక్షాలతో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయం పావులు కదుపుతున్నట్టు ఈ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర యూనిట్లు కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశముంది.

విధివిధానాలు ఖరారు..

కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన జమ్ముకశ్మీర్‌లో వీలైనంత త్వరగా శాసనసభ ఎన్నికలు నిర్వహించేలా ఈ చర్చల విధివిధానాలు ఖరారు చేయడంలో పీఎంవో నిమగ్నమై ఉంది. ఈ మేరకు దిల్లీలో పీఏజీడీ నేతలతో ప్రధాని నిర్వహించే సమావేశంలో సరిహద్దుల నిర్ణయం, శాసనసభ ఎన్నికలు, 2019 ఆగస్ట్‌ 5న తొలగించిన రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రధాన చర్చనీయాంశాలయ్యే అవకాశముంది.

ఆయన నేతృత్వంలో?

పీఎంవో సూచనల మేరకు.. కశ్మీర్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరుఖ్‌ అబ్దుల్లాతోపాటు ఈయన సారథ్యం వహిస్త్నున పీఏజీడీలో భాగస్వాములుగా ఉన్న పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జాద్‌ లోనె, జమ్మూకశ్మీర్‌ అప్నీ పార్టీ నాయకుడు అల్తాఫ్‌ బుఖారి తదితరులతో అధికారులు ఇప్పటికే సంప్రదింపులు జరిపే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇవీ చదవండి: జమ్ముకశ్మీర్​లో భారీగా ఆయుధాలు స్వాధీనం

కశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

కశ్మీర్​లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.