ETV Bharat / bharat

'డిజిటల్​ హెల్త్​ మిషన్​'ను నేడు ప్రారంభించనున్న మోదీ

author img

By

Published : Sep 27, 2021, 5:27 AM IST

Pradhan Mantri Digital Health Mission
ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్

దేశవ్యాప్తంగా అమలు చేయనున్న 'ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్​'ను(Pm Digital Health Mission) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నేడు ప్రారంభించనున్నారు. వర్చువల్​గా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 'ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్'ను(పీఎండీహెచ్​ఎం)(Pm Digital Health Mission)​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Modi News) నేడు ప్రారంభించనున్నారు. వర్చువల్​గా ఆయన ఈ కార్యక్రమంలో(Pm Digital Health Mission)​ పాల్గొనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

"సెప్టెంబర్​ 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... 'ప్రధానమంత్రి డిజిటల్​ హెల్త్​ మిషన్'​ను ప్రారంభిస్తారు. వర్చువల్​గా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆయన ప్రసంగిస్తారు.

-ప్రధానమంత్రి కార్యాలయం

ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే.. పైలట్​ ప్రాజెక్టుగా పీఎండీహెచ్​ఎం(Pm Digital Health Mission)​ అమలవుతోందని పీఎంఓ తన ప్రకటనలో పేర్కొంది. అయితే... ఆయుష్మాన్​ భారత్​ పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. పీఎండీహెచ్​ఎంను ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు చెప్పింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయా కూడా హాజరవుతారని తెలిపింది.

ఏంటీ ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్?

  • టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించే కార్యక్రమం.
  • దీని కింద ప్రతి భారతీయుడికి హెల్త్​ ఐడీ కేటాయిస్తారు.
  • హెల్త్ ఐడీ ఆధారంగా ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.

హెల్త్ ఐడీ అంటే?

  • ప్రతి ఒక్కరికీ ఆధార్​ తరహాలో ఇచ్చే విశిష్ట సంఖ్యే హెల్త్​ ఐడీ.
  • ఈ నెంబర్ ద్వారా వారి ఆరోగ్య రికార్డులు నమోదు చేస్తారు.
  • వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది.
  • ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ ఆధారంగా ఆరోగ్య సమాచారాన్ని అక్కడి వైద్యులు పరిశీలించేందుకు వీలు కలుగుతుంది.

ఏ సమాచారం నిక్షిప్తమవుతుంది?

  • మనం చేయించుకున్న వైద్య పరీక్షల వివరాలు.
  • ఇదివరకు వైద్యులు సూచించిన మందులు.
  • గతంలో ఏం చికిత్స తీసుకున్నారనే విషయాలు.
  • ఆ వ్యక్తికి వర్తించే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, బీమా వివరాలూ ఉండే అవకాశం.

ఉపయోగాలు ఏంటి?

  • దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
  • మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్‌, ఈ- ఫార్మసీలు సేవలు అందుతాయి.
  • ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలుగుతుంది.

డిజిటల్ హెల్త్ మిషన్​ అమలు ఎలా?

ఈ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుంది. ఆ పథకం విధివిధానాలకు అనుగుణంగానే ఎన్​డీహెచ్​ఎం అమలవుతుంది.

మన సమాచారానికి భద్రత ఉంటుందా?

  • వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్‌ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: Delta variant: కొత్తకోరలు తొడుక్కుంటున్న మహమ్మారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.