ETV Bharat / bharat

'కరోనా టీకా కనిపెట్టింది మోదీయే'

author img

By

Published : Apr 2, 2021, 6:22 PM IST

కొవిడ్​ టీకాను ప్రధాని నరేంద్ర మోదీ కనుగొన్నారంటూ ఏఐఏడీఎంకే మంత్రి ఒకరు విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పక్కన ఉండగానే ఈ వ్యాఖ్యలు చేశారు ఉదయ్​ కుమార్.

PM Modi discovered world's first COVID vaccine! Says this AIADMK Neta
కరోనా టీకా కనిపెట్టింది ప్రధాని మోదీయే!

ప్రపంచంలోని మొట్టమొదటి కరోనా టీకాను ప్రధాని నరేంద్ర మోదీ కనుగొన్నారని ఏఐఏడీఎంకే మంత్రి ఆర్​బీ ఉదయ్​కుమార్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ గౌరవాన్ని పొందేందుకు ఆయన కృషి చేశారని వివరించారు. మధురై ఎన్నికల ప్రచార సభలో మోదీతో కలిసి వేదికపై ఉన్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇవీ చదవండి: 'ఆ రెండు కూటములతో విసుగెత్తిన ప్రజలు'

'ఓటమి తప్పదనే భాజపా ఐటీ దాడుల అస్త్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.