ETV Bharat / bharat

PM CARES Fund: 'పీఎం కేర్స్​ ఫండ్​ ప్రభుత్వ నిధి కాదు'

author img

By

Published : Sep 23, 2021, 2:31 PM IST

PM-CARES Fund
పీఎం కేర్స్​ ఫండ్

పీఎం కేర్స్ ఫండ్(PM CARES Fund)​ అనేది చట్టానికి లోబడి ఏర్పాటు చేసిన ఛారిటబుల్​ ట్రస్ట్​గా దిల్లీ కోర్టుకు తెలిపింది కేంద్రం. పీఎం కేర్స్ ఫండ్ భారత ప్రభుత్వ నిధి కాదని స్పష్టం చేసింది. ట్రస్టులోని నగదు ప్రభుత్వ మూలధన నిధిలోకి వెళ్లదని పేర్కొంది. ఈ మేరకు కోర్టుకు అఫిడవిట్​ దాఖలు చేసింది.

పీఎం కేర్స్​ ఫండ్​(PM CARES Fund) అనేది భారత ప్రభుత్వ నిధి కాదని, సేకరించిన నగదు ప్రభుత్వ కాన్సాలిడెటెడ్​ నిధికి వెళ్లదని దిల్లీ కోర్టుకు తెలిపింది కేంద్రం. పీఎం కేర్స్​ నిధిని(PM CARES Fund) రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ నేపథ్యంలో అఫిడవిట్​ దాఖలు చేసింది. ట్రస్టు పారదర్శకంగా పని చేస్తున్నట్లు తెలిపారు పీఎం కేర్స్​ ట్రస్ట్​లో(pm cares trust) విధులు నిర్వర్తిస్తున్న పీఎంఓ సెక్రటరీ ప్రదీప్​ కుమార్​ శ్రీవాస్తవా. భారత కంట్రోలర్​, ఆడిటర్​ జనరల్ ఏర్పాటు చేసిన ప్యానల్​ ద్వారా పీఎం కేర్స్​ ఫండ్స్​ను ఆడిట్​ చేసినట్లు చెప్పారు.

"పీఎం కేర్స్​లో పారదర్శకతను తెలిపేందుకు ఆడిట్​ చేసిన నివేదికను అధికారిక వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచాం. నివేదికతో పాటు ట్రస్టుకు వచ్చిన విరాళాలు ఏ విధంగా ఖర్చు చేశామనే వివరాలను పొందుపరిచాం. పిటిషనర్​ ఒక ప్రజాచైతన్య వ్యక్తిగా చెప్పుకుంటున్నప్పుడు.. కేవలం పారదర్శకత కోసమే కాదు, ఇతర ఉపశమనాల కోసమూ కోరాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్​ 12 ప్రకారం పీఎం కేర్స్​ ప్రభుత్వ నిధిగా పరిగణించాల్సిన అవసరం లేదు. ట్రస్టులో గౌరవ ప్రాతిపదికన పని చేస్తున్నా. ఇది ఛారిటబుల్​ ట్రస్ట్​. రాజ్యాంగం, పార్లమెంట్​, రాష్ట్ర శాసనసభ తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఏర్పాటు చేసింది కాదు.

పారదర్శక నియమాలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్రస్టు పని చేస్తోంది. కాబట్టి, పారదర్శతను తీసుకొచ్చేందుకు అన్ని తీర్మానాలను వెబ్​సైట్​లో పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ట్రస్టు ఫండ్​ భారత ప్రభుత్వం నిధి కాదు. ఆ నిధులు ప్రభుత్వ మూలధనంలోకి వెళ్లవు. "

​- ప్రదీప్​ కుమార్​ శ్రీవాస్తవా, పీఎంలో అండర్​ సెక్రెటరీ.

పీఎం కేర్స్​ ఫండ్(PM CARES Fund)​ ప్రభుత్వ ప్రత్యేక నిధి అని, దానిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020, మార్చి 27న ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు పిటిషనర్​ సమ్యాక్​ గంగ్వాల్​. ఈ నిధి రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ నిధి కిందకు రాకుంటే.. ప్రభుత్వ డొమైన్​గా ఉన్న పేరును మార్చటం సహా ప్రధాని ఫొటో, లోగో వంటి వాటిని తొలగించాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ట్రస్టీలుగా ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారని, ఈ ట్రస్టును ఏర్పాటు చేసినప్పుడే.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. పారదర్శకత, జవాబుదారితనాన్ని కాపాడేందుకు పీఎంకేర్స్​ వెబ్​సైట్​పై ఆడిట్​ నిర్వహించటం, విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు.

ఇరు వర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పటేల్​, జస్టిస్​ అమిత్​ బన్సాల్​ల ధర్మాసనం.. విచారణను సెప్టెంబర్​ 27కు వాయిదా వేసింది. ​

ఇదీ చూడండి: Supreme Court: అనాథ బాలలకు త్వరగా 'పీఎం కేర్స్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.