ETV Bharat / bharat

73 ఏళ్ల వయసులో పీహెచ్​డీ.. గాంధీ భావజాలంపై థీసిస్​

author img

By

Published : Dec 16, 2021, 1:33 PM IST

Gandhian earned PhD doctorate
పట్టా అందుకుంటున్న తంగప్పన్​

PHD in old age: 73 ఏళ్ల వయసులో పీహెచ్​డీ పూర్తి చేసి ఔరా అనిపించారు తమిళనాడు, కన్యాకుమారికి చెందిన ప్రముఖ గాంధేయవాది తంగప్పన్​. ఆ రాష్ట్ర గవర్నర్​ ఎన్​ రవి చేతుల మీదుగా పట్టా అందుకున్న ఆయన.. తాను సర్టిఫికెట్​ కోసం పీహెచ్​డీ చేయలేదని, గాంధీజీ ఆలోచనలు భవిష్యత్తు తరాలకు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

PHD in old age: ఉద్యోగ విరమణ తర్వాత.. ఎవరైనా విశ్రాంతి తీసుకునేందుకే మొగ్గు చూపుతారు. కానీ, తమిళనాడు, కన్యాకుమారి జిల్లాకు చెందిన 73 ఏళ్ల తంగప్పన్​ అలా చేయలేదు. గాంధేయ భావజాలం, చరిత్రపై ఆసక్తితో పీహెచ్​డీ పూర్తి చేయాలని సంకల్పించుకుని.. చేసి చూపించారు. తమిళనాడు గవర్నర్​ ఎన్​ రవి చేతుల మీదుగా బుధవారం పీహెచ్​డీ పట్టా పొందారు.

కన్యాకుమారిలోని పుత్తూర్​ గ్రామానికి చెందిని తంగప్పన్​.. ఉపాధ్యాయుడిగా సేవలందించి 65 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేశారు. గాంధేయవాది అయిన ఆయనకు మహాత్ముడి భావజాలం, చరిత్రపై ఆసక్తి ఎక్కువ. మనోన్​మనియమ్​ సుందర్నార్​ విశ్వవిద్యాలయంలో చరిత్ర సబ్జెక్ట్​లో పీహెచ్​డీకి నమోదు చేసుకున్నారు.

2018లో పీహెచ్​డీ పూర్తి చేశారు. ప్రస్తుతం హింసాత్మక ప్రపంచంలో గాంధీజీ ఆలోచనలు ఏవిధంగా ప్రభావం చూపుతాయనే అంశాలపై పరిశోధన చేశారు. అయితే, కరోనా మహమ్మారితో విధించిన లాక్​డౌన్​ కారణంగా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.

Gandhian earned PhD doctorate
పట్టా అందుకుంటున్న తంగప్పన్​

బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్​ చేతుల మీదుగా పీహెచ్​డీ పట్టా అందుకున్నారు తంగప్పన్​. 'సర్టిఫికెట్​ కోసం నేను పీహెచ్​డీ చేయలేదు. గాంధీజీ ఆలోచనలను నేను ఆరాధిస్తాను. భవిష్యత్తు తరాలకు గాంధిజమ్​ గురించి తెలియాలి. దాంతో సమాజంలో శాంతి, ప్రేమానురాగాలు నిండి ఉగ్ర చర్యలు తొలగిపోతాయి' అని పేర్కొన్నారు తంగప్పన్​.

ఇదీ చూడండి: Azadi ka Amrit Mahotsav: భారతీయులకు బిరుదులు ఎరగా వేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.