ETV Bharat / bharat

కొత్త సంవత్సర​ వేడుకలకు కరోనా సెగ- కఠిన ఆంక్షలు

author img

By

Published : Dec 31, 2020, 10:10 AM IST

Updated : Dec 31, 2020, 10:17 AM IST

కొత్త రకం కరోనా వైరస్​ కలవరపెడుతున్న తరుణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలకు సన్నద్ధమయ్యాయి. ఈ మేరకు దిల్లీ, కేరళ, కర్ణాటకల్లో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి.

Night curfew imposed in Delhi, no new year celebrations at public places
ఆ రాష్ట్రాల్లో న్యూ ఇయర్​ వేడుకలకు కరోనా సెగ!

కరోనా కొత్త రకం వైరస్‌ వ్యాప్తి కారణంగా.. పలు రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ దిల్లీలో కర్ఫ్యూ విధించారు. ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత ఇండియా గేట్ పరిసరాల్లో సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. రాజ్‌పథ్, విజయ్‌చౌక్, పార్లమెంటు పరిసరాల్లోనూ ప్రజల రాకపోకలను నిషేధించారు. కన్నాట్ ప్లేస్, మార్కెట్ ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించారు. అయితే.. కొవిడ్​-19 వ్యాప్తిని అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టామని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

నూతన సంవత్సరం నేపథ్యంలో కరోనా వ్యాప్తిని పెంచే సామూహిక సమావేశాలు, సంబరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ బుధవారం అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. అధిక సంఖ్యలో జనం గుమిగూడటాన్ని నివారించాలని, స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలుచేస్తున్నాయి.

మరికొన్ని రాష్ట్రాల్లోనూ..

  • వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ వేడుకలపై నిషేధం విధిస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత అన్ని వేడుకలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
  • ముంబయిలో ఈ రోజు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సెక్షన్​ 144 అమల్లో ఉంటుందని తెలిపారు.
  • కర్ణాటకలోని ఈ సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. ఐదుగురు లేక అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరడం సహా బహిరంగంగా వేడుకలను జరుపుకోవడాన్ని నిషేధించారు.
  • ఇవే తరహా ఆంక్షలు.. పంజాబ్​, మహారాష్ట్ర, రాజస్థాన్​లలోనూ కొనసాగనున్నట్టు ఆయా రాష్ట్రాల అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నగల దుకాణంలో రూ.7 కోట్ల ఆభరణాలు చోరీ

Last Updated : Dec 31, 2020, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.