ETV Bharat / bharat

రైల్లో మహిళకు కాంగ్రెస్​ ఎమ్మెల్యేల వేధింపులు.. విచారణ కమిటీ వేసిన సీఎం

author img

By

Published : Oct 9, 2022, 7:27 AM IST

MP: Days after woman on Rewanchal Express accuses Congress MLAs of rape, Kamal Nath seeks reply from duo
MP: Days after woman on Rewanchal Express accuses Congress MLAs of rape, Kamal Nath seeks reply from duo

రైల్లో ప్రయాణిస్తున్న 32 ఏళ్ల మహిళను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కేసు నమోదుచేశారు పోలీసులు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఆరోపణలను తోసిపుచ్చారు. మరోవైపు, ఈ కేసు విచారణ కోసం మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

రైల్లో ప్రయాణిస్తున్న 32 ఏళ్ల ప్రయాణికురాలిని లైంగిక వేధింపులకు గురి ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ శాసనసభ్యులపై పోలీసులు శుక్రవారం కేసు నమోదుచేశారు. మరోవైపు, ఈ ఆరోపణలను ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు.
"రేవా నుంచి భోపాల్‌ వెళుతున్న రేవాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో హెచ్‌-1 బోగీలో నేను నా కుమారుడితో కలిసి ప్రయాణిస్తున్నాను. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న కోట్మా శాసనసభ్యుడు సునీల్‌ సరాఫ్‌, సత్నా శాసనసభ్యుడు సిద్ధార్థ్‌ కుశ్వాహా నా చేయి పట్టుకుని తమతో డిన్నర్‌ చేయాల్సిందిగా కోరారు" అని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్నీ-దమోహ్‌ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

రైలు సాగర్‌ రైల్వేస్టేషన్‌ వచ్చాక పోలీసులు బోగీలోకి వెళ్లి ఎమ్మెల్యేలను విచారించారు. "శాసనసభ్యులపై ఐపీసీ-354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశాం" అని సాగర్‌ రైల్వే పోలీసుస్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌ అహిర్వార్‌ తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే సునీల్‌ సరాఫ్‌ మాట్లాడుతూ.. "మాపై ఆరోపణలు చేసిన మహిళ తన కుమారుడిపై ప్రమాణం చేసి.. మేం అత్యాచారం చేశామని చెబితే మేం ఎలాంటి శిక్షకైనా సిద్ధం" అని పేర్కొన్నారు.

MP: Days after woman on Rewanchal Express accuses Congress MLAs of rape, Kamal Nath seeks reply from duo
ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ ఎమ్మెల్యే

అయితే ఈ ఘటనపై మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు కమల్​నాథ్​ సీరియస్​ అయ్యారు. ఈ ఘటనపై తమ సమాధానాలు చెప్పాలని ఇద్దరు ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి: దేశంలో తొలి 'సోలార్​ విలేజ్'​గా మొఢేరా

ఉద్ధవ్‌, శిందేలకు షాక్‌.. పార్టీ గుర్తును స్తంభింపజేసిన ఎన్నికల సంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.