ETV Bharat / bharat

ఫిర్యాదు చేసేందుకు వచ్చి.. ఠాణాలోనే బాలిక​ ప్రసవం

author img

By

Published : Jul 28, 2021, 12:22 PM IST

rape victim minor gave birth news
మైనర్​పై అత్యాచారం

తనపై జరిగిన అత్యాచారం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్​కు వచ్చిన ఓ మైనర్​కు ఆకస్మాత్తుగా అక్కడే పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దాంతో స్టేషన్​లోని మహిళా సిబ్బంది.. ఆమెకు ప్రసవం చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

తనపై జరిగిన అత్యాచారం గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్​ స్టేషన్​కు వచ్చిన ఓ బాలిక​.. అక్కడే ప్రసవించింది. మధ్యప్రదేశ్​ ఛింద్​వాడా జిల్లాలో జరిగిందీ ఘటన.

అసలేమైంది?

ఛింద్​వాడాలోని కుందిపురా పోలీస్​ స్టేషన్​కు మంగళవారం సాయంత్రం ఓ 14 ఏళ్ల బాలిక.. తనపై జరిగిన అత్యాచారం గురించి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే.. అదే సమయంలో ఆకస్మాత్తుగా ఆమెకు నొప్పులు వచ్చాయి. దాంతో స్టేషన్​​ ఇన్​ఛార్జ్​ పూర్వ చౌరాసియా ఆమెకు ప్రసవం చేశారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

ఘాట్ పరాసియా ప్రాంతానికి చెందిన ఆకాశ్​ అనే వ్యక్తి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని పూర్వ చౌరాసియా తెలిపారు. అయితే.. తనను పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించడం వల్ల బాధిత బాలిక.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్​ స్టేషన్​కు వచ్చిందని చెప్పారు.

బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్​లో బాలిక ప్రసవించిన అనంతరం.. ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్షేమంగా ఉందని పోలీసులు చెప్పారు.

ఇదీ చూడండి: బస్సు ట్రక్కు ఢీ- 18 మంది మృతి

ఇదీ చూడండి: ఆకస్మిక వరదల బీభత్సం- ఎనిమిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.